Home News Stories

కాలగర్బంలో కలిసిన నెల్లూరు పెద్ద రెడ్లు…!

దశబ్దాలుగా ఆ జిల్లాను శాసించిన రాజకీయ కుటుంబాలు అవి.. పార్టీలు ఏవైనా వారికున్న ప్రాదాన్యత అంతా ఇంతా కాదు.. జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన నాయకులు వారు. ఎంతో మందికి రాజకీయ ఓనమాలు దిద్దించి..రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన నాయకులు వారు. ఇదంతా ఒకప్పుడు.. కట్ చేస్తే మారిన కాలంతో పాటు రాజకీయం కూడా వేగంగా మారింది. ఒకప్పుడు సింహపురిని శాసించిన నెల్లూరు పెద్దా రెడ్డిలు నేడు తెరమరుగయ్యారు.. నాడు కనుసైగలతో శాసించిన నేతలు.. నేడు రాజకీయ మనుగడ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నెల్లూరు పెద్దా రెడ్డిలుగా చక్రం తిప్పిన పొలిటికల్ ఫ్యామిలీస్ నేడు చక్రాలు ఉడిపోయిన బండ్లుగా మారిపోయారు.

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తొలి నుంచే రెడ్డి సామాజిక వర్గందే డామినేషన్ . ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నేచి నేటి విభజన ఆంద్రా వరకు ఈ సామాజి వర్గం నేతలే ఈ జిల్లా రాజకీయాలను నడిపించారు. సింహపురి పాలిటిక్స్ గురించి చెప్పాలంటే.. మందుగా ఇక్కడ ఉన్న రాజకీయ కుటుంబాలు గురించి చెప్పాలి. ఈ జిల్లాలో పెద్ద రెడ్లు అంటే దశబ్దాలుగా జిల్లా రాజకీయాలను తమ కనుసైగలతో శాసించిన నాయకులు అని అర్దం … వీరిలో బెజవాడ, ఆనం, నల్లపురెడ్డి, నేదరుమల్లి కుటుంబాలు ధశాబ్దాల పాటు నెల్లూరు జిల్లా రాజకీయాలు శాసించారు.

ఆనం రెండో తరంగా ఆనం వెంకటరెడ్డి రెండో కుమారుడు ఆనం రామనారాయణ రెడ్డి ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలోనే తండ్రితో సహా అసెంబ్లీ కి పోటీ చేసి నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామనారాయణ రెడ్డి కూడా ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత ఆనం కుటుంబం తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే సమయంలో ఆనం వివేకానందరెడ్డి నెల్లూరు మున్సిపల్ చైర్మెన్ గా పనిచేశారు. రామనారాయణ రెడ్డి రాపూరు ఎమ్మెల్యేగా , ఆ తరువాత ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామనారాయణ రెడ్డి తో పాటు వివేకానం రెడ్డి నెల్లూరు ఎమ్మెల్యేగా రెండు స్లార్లు, నెల్లూరు రూరల్ నుంచి ఓ సారి ఎమ్మెల్యేగా పనిచేశారు. వివేకానందరెడ్డి నెల్లూరు రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే విలక్షణమైన నేతగా గుర్తింపు పొందారు. తను వేష బాషలతో రాష్ట్ర రాజకీయాల్లో అరుదైన ఎమ్మెల్యేగా ప్రత్యేకతను తెచ్చుకున్నారు. ఆనం సోదరులు వైయస్ రాజశేఖర్ రెడ్డికి ముఖ్య అనుచరులు గా కొనసాగారు. రామనారాయణ రెడ్డి వైయస్ హాయంలో రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. వైయస్ మరణాంతరం రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లు సిఎంగా పని చేసిన సమయంలో కూడా శాఖ మంత్రిగా రామనారాయణ రెడ్డి పనిచేశారు .

రామనారాయణ రెడ్డి ఒకానొక దశలో రోశయ్య తరువాత సిఎం స్థానానికి కూడా పోటీ పడ్డారు. ఇలా ఆనం సోదరులిద్దరూ మూడు దశాబ్దాల పాటు జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తమ మార్కును వేసుకున్నారు. ఆనం వివేకా, రామానారాయణ తో పాటు వీరి ట్విన్ బ్రదర్స్ ఆనం జయకుమార్ రెడ్డి నెల్లూరు కార్పొరేషన్ లో , విజయ కుమార్ రెడ్డి రూరల్ నియోజకవర్గంలో కీలకంగా ఉంటూ అన్నలు ఇద్దరికి పార్టీలో, పాలనలో అండగా నిలిచారు. రాష్ట్ర విభజన ఆనం కుటుంబం పాలిట శాపంగా మారింది. కాంగ్రెస్ మెత్తం ఖాళీ అయినా ఆనం బ్రదర్స్ మాత్రం గత ఎన్నికల్లో కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఆనం రామనారాయణ రెడ్డి గత ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి పోటీ చేసి ఓడిపోగా.. ఆనం వివేకానందరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై పెద్ద కుమారుడు ఏసి సుబ్బారెడ్డిని నెల్లూరు సిటి నుంచి కాంగ్రెస్ అబ్యర్దిగా బరిలోకి దిగారు. ఇదే సమయంలో మరో సోదరుడు ఆనం జయ కుమార్ రెడ్డి అన్నలతో విబేదించి జై సమైక్యాంద్ర పార్టీ నుంచి నెల్లూరు సిటి అభ్యర్దిగా పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో ఈ ముగ్గురు ఘోరంగా ఓడిపోయారు. తదనంతర పరిస్తితుల్లో ఆనం సోదరులు రామనారాయణ రెడ్డి, వివేకానందరెడ్డిలు టిడిపిలో చేరగా… తమ్ముళ్లు జయ వేరుగా అప్పిటికే టిడిపిలో కొనాసగుతుండగా.. మరో సోదరుడు విజయ కుమార్ రెడ్డి కూడా అన్నలను విభేదించి వైసిపిలోకి వెళ్లిపోయారు.

అలా ఆనం వారు ఏలిన నెల్లూరు సిటి, నెల్లూరు రూరల్, ఆత్మకూరు లో కాకుండా ఆనం రామనారాయణ రెడ్డి విదిలేని పరిస్తితుల్లో వెంకటగిరి నియోజకవర్గానికి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఈ నియోజకవర్గంలో ఉన్న మూడు మండాలాలు గతంలో ఆనం ప్రాతినిద్యం వహించిన మండాలు కావడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి వైసిపి అబ్యర్దిగా బరిలో ఉన్నారు. ఈ ఎన్నికలు ఆనం రామనారాయణ రెడ్డి కి చాలా కీలకంగా మారాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆనం కుటుంబం భవిష్యత్తు ఈ ఎన్నికలతో ముడిపడింది అని చెప్పవచ్చు. ఆనం రామానారాయణ రెడ్డి గెలిస్తే… జిల్లా తో పాటు రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పే అవకాశం వస్తుంది. లేదంటే పరిస్తితి మొత్తం పూర్తిగా తారు మారవుతుంది. ఇలా 80 ఏళ్ల పాటు సింహపురి ని శాసించిన ఆనం ఫ్యామిలి ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చాలా సింపుల్ గా మారిపోవడం చర్చచనీయంశంగా మారింది.

ఇక జిల్లా రాజకీయాల్లో మరో ముఖ్య కుటుంబం నేదురుమల్లి జనార్దన్ రెడ్డిది . నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అద్యాపకుడిగా జీవితం ప్రారంభించినప్పటికీ పివి నరసింహా రావు ద్వారా రాజకీయాల్లో కి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి వరకు జిల్లాలో ఉన్న సీనియర్ నేతలకు డిల్లీ నేతలతో ఉన్న సంబందాలు అంతంత మాత్రమే.. విద్యావంతడు కావడంతో నేదరుమల్లి రాజ్యసభ సబ్యుడిగా 1972 లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. జనార్దన్ రెడ్డి దేశంలోని నాలుగు చట్ట సభలు అయిన లోక్ సభ, రాజ్య సభ, శాసన సభ, శాసన మండలి లో సభ్యుడిగా పనిచేసిన అరుదైన నేతల్లో నేదురుమల్లి ఒకరు. ఉమ్మడి రాష్ట్ర మంత్రి గా రెండు సార్లు పనిచేయడంతో పాటు 1990, 92 మద్య సిఎంగా పనిచేశారు. అప్పట్లో నెల్లూరు ఎంపీ స్తానం రిజర్వుడ్ కావడంతో బాపట్ల, నర్సారావు పేట, విశాఖ పట్నం లో పార్లమెంటు సభ్యుడి గా పనిచారు. అనంతరం రాజ్య సభ సభ్యుడిగా పనిచేశారు.


నేదరుమల్లి నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాలను కూడా శాసించారు. ఆయన భార్య నేదరుమల్లి రాజ్య లక్షి కూడా వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది వైయస్ ప్రభుత్వంలో మంత్రి గా పనిచేశారు. 90 వ దశకంలో నేదరుమల్లి చెప్పిన వారికే జిల్లాలో టికెట్లు ఇచ్చేవారు. ఇలా జిల్లా లో అనేక మందిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలుగా రాజకీయ జీవితాన్ని అందించిన నేత నేదరుమల్లి. నేదరుమల్లి మరణాంతరం ఆయన కుటుంబ ప్రాభవం పడిపోయింది. రాష్ట్ర రాజకీయాలే కాదు… జిల్లా రాజకీయాల్లో కూడా నేదరుమల్లి వారసులు ఉనికి కాపాడుకోలేని పరిస్తితికి వచ్చారు. నేదురుమల్లి రాజ్యలక్ష్మి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటుండగా.. ఆయన కుమారుడు నేదరుమల్లి రామ్ కుమార్ రెడ్డి తన అస్తిత్వం కోసం పోరాడుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున వెంకటగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం బిజేపిలో చేరారు. అక్కడ కూడా పెద్దగా ప్రాదాన్యత లేక పోవడంతో.. తిరిగి ఇప్పుడు వైసిపిలో చేరారు. తమ కుటుంబానికి బద్ద శత్రువులుగా ఉన్న ఆనం కుటుంబానికి చెందిన రామనారాయణ రెడ్డి వెనక నడవాల్సిన ప్రస్తుత పర్తిసతి రామ్ ది అంటే నేదరుమల్లి కుటుంబ పరిస్తితి ఏంటో అర్దం చేసుకోవచ్చు. ఇలా నేదరుమల్లి కుటుంబం పొలిటికల్ గ్రాఫ్ నెల్లూరు జిల్లాలో ఆకాశం నుంచి అద పాతాళానికి పడిపోయిందన్న మాట.

జిల్లాలో మరో కీలకమైన కుటుంబాల్లో నల్లపురెడ్ల కుటుంబం కూడా ఒకటి. 1970 లో నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయాల్లో కి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఆనం ప్యామిలీకి వ్యతిరేకంగా నల్లపురెడ్డి, నేదరుమల్లి లో రాజకీయాలు నడిపారు. చంద్రశేఖర్ రెడ్డి జడ్పీ చైర్మెన్ గా పనిచేశారు. ఆనం కుటుంబాన్ని , నేదురుమల్లి ని విభేదించి కాంగ్రెస్ ని వీడి ఎన్టీఆర్ స్తాపించిన టిడిపిలో చేరారు. అలా వెంకటగిరి లో టిడిపి అబ్యర్దిగా నేదరుమల్లి జనార్దన్ రెడ్డిని ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయనతో పాటు సోదరుడు నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి కూడా ఇదే సమయంలో కోవూరు నుంచి పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలా ఎన్టీఆర్ హయంలో మంత్రిగా పనిచేసి టిడిపిలో కీలకంగా పనిచేశారు. ఆ తరువాత ఎన్టీఆర్ ని విబేదించి శీనయ్య శేనను స్తాపించి రాష్ట్రమంతా పర్యటించారు. తిరిగి మళ్లీ టిడిపిలో చేరి మంత్రిగా పని చేశారు. ఆయన మరణాంతరం ఈయన కుమారుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉప ఎన్నికల్లో కోవూరు నుంచి గెలుపొందారు. చిన్న వయసులో మంత్రిగా కూడా పనిచేశారు ప్రసన్న.

ఇక నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి మేనల్లుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సోమిరెడ్డి మేనమామ వద్ద ఉంటూ ఆయన నుంచి రాజకీయాలను నేర్చుకుని టిడిపిలో కీలకంగా ఎదిగారు. సోమిరెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యే గా సర్వేపల్లి నుంచి గెలుపొందగా.. మూడు సార్లు ఓటమి పాలయ్యారు. అనంతరం బావ బవమరులు సోమిరెడ్డి, నల్లపురెడ్డి ల మద్య విబేదాలు రావడంతో ప్రసన్న పార్టీని వీడి వైసిపిలో చేరారు. వైసిపి నుంచి ఉప ఎన్నికల్లో గెలిచినా.. 2014 లో కూడా ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం నల్లపురెడ్డి ప్రసన్న వైసిపిలో కేవలం కోవూరు నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ప్రసన్న గెలిస్తే ఓకే లేదంటే.. నల్లపురెడ్ల రాజకీయ మనుఘడ ఇక ప్రశ్నార్దకమే అని చెప్పవచ్చు. మరో వైపు సోమిరెడ్డి కూడా ఈ సారి సర్వేపల్లి గెలిచి తీరాల్సిన పరిస్తితి లేదంటే ఈయనకు ఇబ్బందులు తప్పవు. ఆనం, నల్లపరెడ్ల కుటుంబాలకు ఈ ఎన్నికలు చావో రేవుగా మారాయని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here