Home News Updates

కరొనపై మోడీ పిలుపు

ఇప్పటికి లాక్ డౌన్ లో ఉండి తొమ్మిది రోజులు అవుతోంది… దీంతో మీరు మీ ఉన్న ఐకమత్యాన్ని, సేవా దృక్పధాన్ని చూపించారు. ఇది అద్వితీయం.. ప్రస్తుత స్థితిని ఎదుర్కోవడానికి మీరంతా ఏంతో శ్రద్ధతో, ప్రయాసతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కరొనతో ఇబ్బంది పడుతున్నాయి. ఇటువంటి తరుణంలో సామూహిక శక్తి అవసరం. దేశం మొత్తం ఒకటైతే కరొనపై యుద్ధంలో గెలవచ్చు. చరిత్రలో ఇది ఓ పెద్ద ఘట్టం. ఇప్పుడు దేశంలో ప్రతీ ఒక్కరూ ఇళ్లలోనే ఉన్నారు. ఒక్కరే ఈ యుద్ధంలో ఎలా గెలవచ్చు? అంటా సంఘటితంగానే విజయం సాధించవచ్చు. ఇది దేశంలోని 130 కోట్ల మంది సామూహిక శక్తితో భవిష్యత్తు కోసం పోరాటం చేయాలి. దీంతో మహాశక్తి సాక్షాత్కారం అవుతుంది. ఈ సంకల్ప బలం మనకు మనోబలం, లక్ష్యాన్ని సమకూరుస్తుంది.

Modi Speech on Corona Virus for April 5, 2020

మన మార్గాన్ని స్పష్టం చేస్తుంది. ఈ పోరాటంలో అంధకారాన్ని దూరంచేయడానికి వెలుగు కోసం ముందుకు వెళ్ళాలి. ఈ కరోనా సంకట స్థితితో అంధకారం, అనిష్చితి ఏర్పడింది. దీన్ని ఓడకొట్టాలి. ఇందుకోసం నలుదిక్కులా వెలుగులు నింపాలి. ఈ నెల 5 న 130 కోట్ల మంది మహాశక్తి కోసం జాగరణ చేయాలి. ఈ నెల 5న ఆదివారం రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాల పాటు ఇళ్లలో అన్ని లైట్స్ ఆపివేసి తొమ్మిది నిమిషాలపాటు, అగరబట్టి, దీపాలు కానీ, మొబైల్ పహ్లష్ లైట్ వెలిగించండి.

ఆ సమయంలో అన్ని లైట్స్ ఆపివేయండి. ఇలా చేయడం వల్ల వచ్చే ప్రకాశం వల్ల సంకల్ప బలంతో మనం ఒంటరి కాదు అని తెలుస్తుంది. 130 కోట్ల మంది కృత సంకల్పం ఇది. ఈ సమయంలో ఎవరూ బయట గుంపులుగా ఇది చేయద్దు. సోషల్ డిస్టెంసింగ్ లక్షణ రేఖ కు దూరంగా ఉండండి. కరోనా వైరస్ చైన్ ని బ్రేక్ చేయడానికి ఇదే సరైన రామ బాణం. ఇది సంకట స్థితిని ఎదుర్కోడానికి బలం ఇస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here