Home Videos

ఈటెల రాజేందర్ కి సీఎం కేసీఆర్ కి ఆ ఘటనతోనే గొడవలు…!

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఈటల రాజేందర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆయన మీద ఆరోపణలు మొదలు మంత్రి వర్గం నుంచి తొలగించడం ఈటల బీజేపీ గూటికి చేరడం వంటి రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. సీఎం కేసీఆర్ తో మొదటి నుంచి సన్నిహితంగా ఉన్న నాయకుల్లో ఈటల రాజేందర్ ఒకరు. అలాంటిది వీరిద్దరికి విభేదాలు మొదలయింది ఎక్కడ అన్న దానిపై పొలిటికల్‌ అనలిస్ట్ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ రావు సంచలన విషయాలు తెలిపారు.

గులాబీ జెండాకి ఓనర్లు ఎవరు ఉండరంటూ 2019లో ఈటల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అంతకు ముందు ఈటల కొడుకు పెళ్లి సమయంలో ఆయన ఇల్లు చూసి కన్నుకుట్టిన కొందరు కేసీఆర్ కి మరో రకంగా ఎక్కించారని అలాగే ఎమినిటీస్ కమిటీ సమావేశం సమయంలో గతంలో ఆర్ధికమంత్రిగా ఉన్న ఈటల తీసుకున్న ఓ నిర్ణయం కూడా సీఎం కేసీఆర్ తో వివాదానికి కారణమైందన్నారు. ఈ వివాదంలో ఎంపీ సంతోష్ ది కీలకపాత్ర అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here