Home News

ఈటల కోట పై గురి పెట్టిన కేసీఆర్..రేసులోకొచ్చిన ఐదుగురు నేతలు

మాజీ మంత్రి ఈటలను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఎత్తుగడలు సిద్దం చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్దమవుతున్న ఈటలకు ధీటైన అభ్యర్దిని నిలబెట్టేందుకు కేసీఆర్ ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టినట్లు తెలిసింది. తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో ఈటల ఎన్నికకు సిద్దమవుతుండటంతో ధైటైన అభ్యర్థిని ఎంపిక చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఈటల పై మాజీ ఎంపీ , ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ , రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు మాటల దాడి మొదలు పెట్టగా, బీసీ కమీషనర్ మాజీ సభ్యుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు , బీజేపీ నేత మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి , కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డిల అభ్యర్థిత్వాలపై ముఖ్యమంత్రి అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.

పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలైన బోయిన పల్లి వినోద్ కుమార్ మంత్రిని చేసే ఆలోచనతో ఇక్కడి నుంచి పోటీలో నిలపాలని ఆలో చిస్తున్నట్లు తెలసింది . మరో సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు లేదా వారి కుటుంబంలో ఒకరిని ఎన్నికల బరిలో దించితే ఎలా ఉంటుందని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు తెలసింది . మొదటి నుంచి పార్టీలో నాయకుడికి వీర విజేతగా కొనసాగుతున్న వకుళాభరణం కృష్ణ మోహన్ పేరును సీఎం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. 2009 సాధారణ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నిల బరిలో నిలిచి ఈటల రాజేందర్ పై 15 వేల ఓట్లు స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు .

ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ మంత్రి ఇనగాల పెద్దిరెడ్డితో కూడ కెసిఆర్ మాట్లాడారని అవకాశం వస్తే ఉప ఎన్నికలో పెద్ది రెడ్డి ని పోటీ కి దింపుతారని కూడా టాక్. గత ఎన్నికల్లో హుజురాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి తో కూడా చర్చించినట్లు ప్రచారం జరుగుతుంది . పెద్దిరెడ్డి పాత హుజురాబాద్ నియోజవర్గం నంచి రెండు సార్లు గెలుపొంది తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. మొత్తానికి ఈటలకు ధీటుగా గట్టి రణతంత్రాన్నే కేసీఆర్ రచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here