Home News Politics

ఇలాంటి దోమల ప్రచారమే చంద్రబాబుని నిండా ముంచింది….

2014-2019 బాబుగారి పనితీరు ను గమనిస్తే ఆయనకు ఒక అజ్ఞాత “సలహాదారుడు”(పరకాల కాదు) ఉన్నట్లు అనిపిస్తుంది. రాష్ట్రం లో ఏ మూల సంఘటన జరిగిన ఒక పద్దతి ప్రకారం టీడీపీ వర్గాలు కదిలేవి,బాబుగారు ఎప్పుడు చెప్పే “సంక్షోభంలో అవకాశం కల్పించుకోవటం” అన్నదానికి ఉదాహరణగా వారి పనితీరు ఉండేది.. బాబుగారు వొచ్చారు సమస్య తీరింది,థ్యాంక్యూ సీఎం సార్ అని పత్రిక ప్రకటనలు.

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో incubatorలో ఉంచిన రోజుల బాలుడు ఎలుకలు కరవటంతో చనిపోతే ఆసుపత్రికి వెళ్లి తల్లితండ్రులను పరామర్శించి ,ఆ ఆసుపత్రిలో వసతులు పెంచటానికి నిధులు ఇవ్వటం చెయ్యకుండ ఎలుకలు పట్టుకున్న వారికి డబ్బులు ఇస్తామని ప్రకటించారు.

ముఖ్యమంత్రి ఊర్లు ఊర్లు తిరిగి దోమల నివారణ మీద ప్రజలను చైతన్యవంతులను చెయ్యాలా?దోమల మీద దండయాత్ర పేరుతొ పొలోమని మంది మార్బలంతో ప్రభుత్వ నిధులతో అట్టహాసంగా ప్రచారం చేసుకోవటం. దోమల మీద డ్రోన్ ల యుద్ధం అని గాల్లో మాటలు చెప్పారు. డ్రోన్ల కోసం ఎంత ఖర్చు పెట్టారో అది వారికే తెలియాలి…

దోమలనివారణకు ఏం చెయ్యాలి? గత 5 సంవత్సరాలతో ఎన్ని ఊర్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ని నిర్మించారు ?ఎన్ని ఓపెన్ మురికి కాలువల మీద బండలు పరిచారు?అసలు మున్సిపల్ పరిశుద్ధ సిబ్బందికి సమయానికి జీతాలు ఇచ్చారా?ఎన్నిసార్లు వాళ్ళు సమ్మె చేశారు ?వాళ్ళ జీతాలు బాబుగారు ప్రచార ఖర్చంతా కూడా కావు.

ముఖ్యమంత్రి దోమల మీద దండయాత్ర ఏంటి అంటే మీ మెదళ్లలో ఉన్న మురికిని శుభ్రం చేసుకోండి అని ఎదురు దాడి. గ్రామీణులు ఇప్పుడు పశువుల పాకలో కూడా దోమతెరలు పెడుతున్నారాని దోమల మీద డ్రోన్ లను ప్రయోగిస్తానన్న ముఖ్యమంత్రికి ఆయన సలహాదారులు చెప్పినట్లు లేరు.

గత 5 సంవత్సరాలలో బాబుగారు పాటించింది ఒకటే సూత్రం ఎదో ఒక పేరుతొ నిత్యం ప్రజలలో ఉండాలి,ఏ ముఖ్యమంత్రి ఇంత కష్టపడడు అని ప్రచారంచేసుకోవాలి. రోజులు మారాయి… ప్రజలు ఫలితాన్ని చూసే పాలనకు మార్కులు వేస్తారు కానీ ప్రచారఆర్భాటంతో వారిని మభ్యపెట్టలేరు.

జీవో లను క్లాసిఫైడ్ పేరుతొ దాచిపెట్టినంత మాత్రాన కళ్ళముందు జరిగిన దుబారా ఖర్చు ప్రజల దృష్టికి రాకుండా పోతుందా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here