Home News

ఇక రవిప్రకాష్ గేమ్ స్టార్ట్…‘మై హోం’పై ఐటీ దాడులు.. అసలు కథ ఇదేనా..!

మై హోం పై ఐటీ దాడుల కలకలం వెనుక చాలా కారణాలే ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దాడులకు సంబంధించి భిన్న కథనాలు వినిపిస్తున్నా… అసలు గుట్టు మాత్రం బెంగళూరు గుట్టు లాగేందుకేనన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. టీఆర్ ఎస్ అధినేత – తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడిన ప్రముఖ పారిశ్రామికవేత్త మై హోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావుకు చెందిన ఇల్లు – కార్యాలయాలపై ఏకంగా వంద మందికి పైగా ఐటీ అధికారులు ఏక కాలంలో దాడులు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది….

గురువారం ఉదయమే ఈ దాడులు మొదలైనా.. సాయంత్రం దాకా అసలు ఈ వార్తనే బయటకు రాలేదు. అయితే సాయంత్రం ఒక్కసారిగా సంచలనం రేపిన ఈ వార్తలతో పెను కలకలమే రేగింది. కేసీఆర్ టార్గెట్ గానే మైహోంలో ఐటీ దాడులు జరిగాయని చాలా మంది అనుకున్నారు. ఇక ఇటీవల అలంద మీడియా పేరిట ఓ కొత్త సంస్థను పెట్టి… దాని చేత టీవీ 9 ఛానెల్ ను కొనేసిన రామేశ్వరరావు…. టీవీ 9 సీఈఓగా ఉన్న రవిప్రకాశ్ ను మెడబట్టి గెంటేసినంత పనిచేశారు కదా. ఈ కసితోనే రవిప్రకాశ్ ఇచ్చిన సమాచారం మేరకే ఐటీ దాడులు జరిగాయని కూడా ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని రవిప్రకాశ్ స్వయంగా వెల్లడించి మరింత కలకలం రేపారనే చెప్పాలి.

ఇక టీవీ9 గురించి.. సమగ్ర సమాచారం.. రవిప్రకాష్ వద్ద ఉంది. ఎందుకంటే.. దానికే ఆయన కర్త, కర్మ, క్రియ. చివరికి కొనుగోలు వ్యవహారాల్లో.. జరిగిన లావాదేవీలపై కూడా.. ఆయనకు పూర్తి అవగాహన ఉంది. లావావేవీలు ఎలా జరిగాయో కూడా.. స్పష్టత ఉంది. ఆ రహస్యాలతోనే. రంగంలోకి దిగారు. తనకు తెలిసిన దర్యాప్తు సంస్థలన్నింటికీ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. జాతీయ స్థాయిలో తనకు జర్నలిస్టుగా ఉన్న గుర్తింపును కూడా ఉపయోగించుకుటున్నారన్న ప్రచారం జరుగుతోంది.

ఇరువురూ ఇప్పుడు.. హోరాహోరీ తలపడుతున్నారు. ఇంత కాలం లేని బలం .. ఇప్పుడు రవిప్రకాష్‌కు అందిందని చెబుతున్నారు. అదే. రాజకీయ అండ. మైహోమ్ రామేశ్వరరావుకు.. తెలంగాణ సర్కార్ లో ప్రాబల్యం ఉంటే. రవిప్రకాష్.. కేంద్రంలో ఆ మద్దతు పొందారన్న అంచనాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు రామేశ్వరరావు గేమ్ ఆడారని.. ఇక రవిప్రకాష్ ఎత్తులు ప్రారంభమయ్యాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here