Home News Stories

ఆ జిల్లాలో దుమ్మురేపుతున్న రాజకీయం…?

ఆ జిల్లా రాజకీయాలే వేరుగా ఉంటాయి. జిల్లాలో అన్నిపార్టీల్లోను అంతర్గత పోరు ఉంటుంది.ఇక ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అధికార పార్టీ అయితే చాలు ఆ పార్టీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుంటుంది. ఇప్పుడు ఆ జిల్లాలో అధికారపార్టీలో మంత్రి పదవి రేస్ లోను, రెండు పార్టీల్లో ఎంపీ రేస్ లోనూ ఒక రేంజ్ లో వివాదాలు సాగుతున్నాయంట.. మరి ఆ వివాదాలను పార్టీల అధిష్టానాలు ఎలా సెట్ చేస్తాయన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.ఖమ్మం జిల్లా రాజకీయాల పై స్పెషల్ స్టోరీ….

ఖమ్మం జిల్లా అనగానే వివాదాల పుట్ట గుర్తుకు వస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాల్లో ఒక్కటంటే ఒక్క స్థానంలోనే టిఆర్ ఎస్ గెలుపొందింది. తెలంగాణ వ్యాప్తంగా అన్నిజిల్లాలో టిఆర్ఎస్ విజయదుందుబి మోగించినప్పటికి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఒక్కటంటే ఒక్క సీటులో మాత్రమే గెలుపొందారు. ఆ ప్రభావం ఇప్పుడు ఎంపి పొంగులేటి మీద పడుతుందా అన్న ప్రచారం సాగుతోంది. వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం పాలేరు నియోజకవర్గాల్లో అంతర్ఘత వివాదాల వల్లనే పార్టీ ఓడిపోయిందని ప్రచారం ఉంది. ఈ నేపద్యంలో పొంగులేటి పై అసంతృప్తి జ్వాలలు పెరిగాయి. వైరా మాజీ ఎంఎల్ఎ మదన్ లాల్, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుల తో పాటు, సత్తుపల్లి నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన పిడమర్తి రవి కూడ పొంగులేటి వల్లనే ఓటమి పాలు అయ్యామని అధిష్టానానికి పిర్యాదు చేశారు. దీంతో ఖమ్మం ఎంపి గా తుమ్మలను రంగంలోకి దించుతారని ప్రచారం సాగుతోంది.

తుమ్మలకు జిల్లా వ్యాప్తంగా అనుచర గణం ఉండడంతో, గతంలో జిల్లాలో టిఆర్ఎస్ బలపడడంతో తుమ్మల కీలకంగా వ్యవహరించడంతో తుమ్మలకు ఎంపీ పదవిని ఇచ్చి గౌరవించాలని అదిష్టానం చూస్తుందని ప్రచారం సాగుతోంది. దీనికి అనుగుణంగానే పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. జిల్లాలో అంతర్ఘత కుమ్ములాటల వల్లనే పార్టీ ఓటమి పాలు అయిందని ప్రచారం సాగుతున్న నేపద్యంలో తుమ్మలకు ఎంపీ పదవిని ఇచ్చి ఆయన పరువును అదిష్టానం కాపాడుతుందని అంటున్నారు. ఈ నేఫద్యంలో నే నిన్న జరిగిన పాలేరు నియోజకవర్గాల సర్పంచ్ ల సన్మాన సభ లో తుమ్మల మాట్లాడిన తీరు చూస్తే ఇదే నిజమని భావిస్తున్నారంటా టీఆర్ఎస్ కేడర్..కన్నతల్లి లాంటి పార్టీ లో ఉంటూ నా ఓటమి కారణం అయిన వారు తాత్కాలిక రాక్షాస ఆనందం పోందుతున్నారని తుమ్మల వ్యాఖ్యానించడం జిల్లా రాజకీయాల్లో సెగలు పుట్టించింది.

ఇక తామేం తక్కువ తినలేదన్నట్టు కాంగ్రెస్ లో కూడా వర్గపోరు పీక్స్ కి చేరింది.ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షులఎంపికనుంచి మొదలైన సెగలు ఎంపీ అభ్యర్ధి ఎవరన్నదానిపై నడుస్తున్న ఘర్షణతో తారా స్థాయికి చేరాయి.డీసీసీ అధ్యక్ష ఎంపికలో పొంగులేటి సుధాకర్ రెడ్డి,రేగా కాంతారవు ఒక రేంజ్ లో ఫైరయ్యారు.జిల్లా అంత తమదే అనుకుంటున్నారని ఇన్ డైరక్ట్ గా భట్టీ పై ఫైరయ్యారు పొంగులేటి.ఇక ఎంపీ టిక్కెట్ విషయంలో అరడజను మంది నేతలు పోటీపడటంతో ప్రతిపక్ష కాంగ్రెస్ లోనూ రాజకీయం రచ్చకెక్కింది.

కాంగ్రెస్ నుంచి ఖమ్మం ఎంపీ టీక్కెట్ రేసులో మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి ఉండగా ఉత్తమ్ అండతో గాయాత్రి రవి పోటిపడుతున్నాడు.ఇక పక్క జిల్లాల నుంచి విజయశాంతి మొదలు వీహెచ్ వరకు ఖమ్మం సీటుకోసం సీరియస్ ట్రై చేస్తున్నారు.దీంతో చిర్రెత్తుకొచ్చిన రేణుకచౌదరి టిక్కెట్ ఇవ్వకపోతే పార్టీని వీడతానంటూ అల్టిమేటం ఇచ్చారు.గత ఎన్నికల్లో సీపీఐ పొత్తు కారణంగా సీటు వదులుకున్నానని ఈ సారి తగ్గేది లేదంటున్నారు.

మొత్తం మీద ఖమ్మంలో రెండు కీలక పార్టీల్లోను విభేదాలు తారాస్థాయికి చేరడంతో పార్టీ అధిష్టానాలు ఈ వర్గపోరుకి ఎలా చెక్ పెడతాయో అన్నఆసక్తి నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here