Home News Updates

అమెరికా అధక్ష్యుడిగా బైడెన్ ప్రమాణస్వీకారం

అగ్రరాజ్యాధినేతగా జోబైడెన్ బుధవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్‌ భవనం క్యాపిటల్‌ హిల్‌ వద్ద ఏర్పాటుచేసిన ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌.. జో బైడెన్‌తో ప్రమాణం చేయించారు. దీంతో జోబైడెన్ అమెరికా చరిత్రలోనే అత్యంత పెద్ద వయస్కుడైన అధ్యక్షుడిగా ఆయన నిలిచారు. భార్యతో కలిసి తీసుకొచ్చిన ఆయన తన 127 సంవత్సరాల నాటి కుటుంబ బైబిల్‌పై ప్రమాణం చేశారు. బెడెన్ డేలావేర్‌ సెనేటర్‌గా ఏడుసార్లు, ఉపాధ్యక్షునిగా రెండు సార్లు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆయన ఇదే బైబిల్ ఉపయోగించడం విశేషం.

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం అనంతరం చేసిన ప్రసంగాన్ని మన తెలుగు వ్యక్తి వినయ్ రెడ్డి రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో అమెరికా అధ్యక్షుడి ప్రసంగం రాసిన తొలి భారతీయ అమెరికన్‌గా వినయ్ రెడ్డి చరిత్ర సృష్టించారు. అమెరికా యునైటెడ్ థీమ్‌తో వినయ్ రెడ్డి అధ్యక్షుడి ప్రసంగాన్ని ప్రారంభించగా బైడెన్న ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న పలు అంశాలను ఇందులో ప్రస్తావించారు. అంతేగాక వినయ్ రెడ్డి ఒబామా హయాంలో ఆయన ముఖ్య ప్రసంగ రచయితగానూ వినయ్ పనిచేశారు. ఈ రోజు మనం వేడుక నిర్వహించుకుంటున్నది ఒక వ్యక్తి విజయం సాధించినందుకు కాదు.. ప్రజాస్వామ్యం గెలుపొందినందుకని బైడెన్ తెలిపారు. ప్రజాస్వామ్యం విలువైందనీ, సున్నితమైందనీ మనం మరోసారి తెలుసుకున్నామన్న ఆయన.. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజుగా.. ఆశలు చిగురించిన రోజుగా అభివర్ణించారు. ప్రపంచ శాంతి, ప్రగతి, భద్రతలో విశ్వసనీయ భాగస్వామిగా ఉంటామని బైడెన్ తన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here