Home News Politics

వైఎస్ వివేకా మృతి…శోక సంద్రంలో‌ వైఎస్ ఫ్యామిలీ..!

SHARE

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాబాయి వైెస్ వివేకానందరెడ్డి మృతి చెందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వైఎస్ వివేకానందరెడ్డి (68)గుండెపోటుతో మరణించారు. కొద్దిసేపటి క్రితం పులివెందులలోని తన స్వగృహంలో ఆయన మృతి చెందారు. కడప పార్లమెంటు ఎన్నికకు రెండు సార్లు వివేకా పోటీ చేశఆరు. 2009లో వివేకా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వివేకానందరెడ్డికి భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు. కిరణ‌్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన వివేకా కొంతకాలం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు.


జగన్ వెంటే ఉండి పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారు. నిన్నటి వరకూ లోటస్ పాండ్ లోనే ఉన్న వివేకా పులివెందులకు బయలుదేరారు. వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం నెలకొంది. వైఎస్ జగన్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని పులివెందులకు బయలుదేరారు. వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీ స్థానానికి పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన వివేకా హఠాన్మరణంతో పులివెందులలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పీఏ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. రక్తపు మడుగులో పడి ఉండటం, తల, చెయ్యికి బలమైన గాయాలు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు డాగ్ స్వ్కాడ్‌ను రంగంలోకి దించారు. వివేకానందరెడ్డి మృతదేహానికి పోస్ట్‌మార్టం జరుగుతోంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏముందోనన్న ఆందోళన ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతోంది. బాత్రూంలో వైఎస్ వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే.. అప్పటికే ఆయన మృతి చెందారు.