Home News Politics

ఆ నలుగురికి జగన్ ఎందుకు షాకిచ్చారు…?

SHARE

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ లకు టిక్కెట్లు ఇవ్వడం లేదు ఎందుకని…? ఐదేళ్ల నుంచి ఆపరేషన్ ఆకర్ష్ కు లోను కాకుండా జగన్ వెన్నంటే ఉంటున్న కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి జగన్ హ్యాండ్ ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీ ఒత్తిళ్లకు తట్టుకుని నిలబడ్డ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు దాదాపు టిక్కెట్ ఖాయమనుకున్నారు. 23 మంది వైసీపీ గుర్తు మీద గెలిచి పార్టీని వీడినప్పటికీ మిగిలిన వారు మాత్రం జగన్ వెన్నంటే నిలిచారు. జగన్ ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ లకు టిక్కెట్ ఇచ్చేందుకు సుముఖంగా లేరన్నట్లు తెలుస్తోంది.

పాణ్యం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో గెలిచిన గౌరు సుచరితా రెడ్డికి జగన్ టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో వైసీపీకి నమ్మకంగా ఉన్న గౌరు కుటుంబం పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంపార్టీలో చేరిపోయింది. పాణ్యంటిక్కెట్ ను బలమైన నేత కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఇవ్వనుండటంతో తాము ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీ మారాలని నిర్ణయించుకున్నామని గౌరు చరిత చెప్పారు. ఇక తాజాగా మదనపల్లి టిక్కెట్ ను దేశాయి తిప్పారెడ్డికి ఇవ్వరని ప్రచారం జరుగుతుది. దేశాయి తిప్పారెడ్డి మదనపల్లెలో గత ఎన్నికలలో గెలిచి పార్టీని నమ్ముకుని ఉన్నారు.

జగన్ పాదయాత్ర సమయంలోనూ తిప్పారెడ్డి కీలక భూమిక వహించారు. అయితే కొన్ని ఈక్వేషన్ల నేపథ్యంలో జగన్ తిప్పారెడ్డికి టిక్కెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో కదిరి టిక్కెట్ చాంద్ భాషాకు ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టిక్కెట్ జలీల్ ఖాన్ కు ఇచ్చారు. ఇద్దరూ టీడీపీలోకి జంప్ అయ్యారు. ముస్లింలకు ఎక్కడో చోట టిక్కెట్ ఇవ్వాలన్నది జగన్ ఉద్దేశ్యం. అందుకోసం కదిరి కంటే మదనపల్లి ముస్లింలకు ఇస్తే బాగుంటుదన్న సూచనల మేరకు అక్కడ ముస్లిం నేతవైపు జగన్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

లోకేష్ మంగ‌ళ‌గిరి నుండి బ‌రిలోకి దిగుతుండ‌టంతో వైసీపీ సైతం వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ వేస్తోంది. ఇప్ప‌టి వ‌రకు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డికి తిరిగి సీటు ఇవ్వాలా ..వ‌ద్దా కొత్త వారిని ఇప్పుడు బ‌రి లోకి తీసుకురావాలా అనే అంశం పై చ‌ర్చ‌లు జ‌రిపింది. ఇదే స‌మ‌యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే సైతం జ‌గ‌న్ కే నిర్ణ‌యా ధికారం వ‌దిలేశారు. ఇప్పుడు వైసిపి కొత్త ఎత్తుగ‌డ పై దృష్టి సారించింది. మంగ‌ళ‌గిరి నుండి లోకేష్ పై పోటీకి జూనియ‌ర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస‌రావును బ‌రిలోకి దించే ప్ర‌తిపాద‌న పై ఆలోచ‌న చేస్తోంది. కొద్ది రోజుల క్రిత‌మే ఆయ‌న వైసీపీ లో చేరారు. జ‌గ‌న్ ఎక్క‌డి నుండి పోటీ చేయ‌మ‌ని చెబితే అక్క‌డి నుండి చేస్తాన‌ని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు నార్నే శ్రీనివాస రావును మంగ‌ళ‌గిరి నుండి బ‌రిలోకి దించుతార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.

ఇక పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు కూడా టిక్కెట్ దక్కే అవకాశాలు లేవంటున్నారు. సునీల్ కుమార్ ప్రశాంత్ కిషోర్ టీం సర్వేలో పూర్తిగా వెనకబడి ఉండటమే ఇందుకు కారణమంటున్నారు. సునీల్ కుమార్ ప్లేస్ లో మరొక కొత్త నేతకు అవకాశమివ్వాలన్నది జగన్ ఆలోచన. గత ఎన్నికల్లో సునీల్ కుమార్ తన ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి లలితకుమారి చేతిలో కేవలం 902 ఓట్ల ఆధిక్యతతో మాత్రమే గెలిచారు. గత ఎన్నికల ఫలితాల్లో మెజారిటీ కూడా సునీల్ కుమార్ కు టిక్కెట్ ఇవ్వకపోవడానికి ఒక కారణమంటున్నారు. మొత్తం మీద ప్రస్తుతానికి వైసీపీలో మూడు సిట్టింగ్ విక్కెట్లు పడ్డట్లేనన్నది పార్టీ వర్గాల టాక్. మరి ఇంకెంత మంది సిట్టింగ్ లకు జగన్ టిక్కెట్లు నిరాకరిస్తారోనన్న టెన్షన్ పార్టీ నేతల్లో ప్రారంభమయింది.