Home Entertainment Cinema

వైఎస్ ఫ్యాన్స్ పై పూనమ్ ఫైర్…

SHARE

ట్విట్టర్‌లో యాక్టివ్ గా ఉంటారు సినీ నటి పూనమ్ కౌర్. గతంలో ట్విట్లతో కేరాఫ్ కాంట్రవర్సిగా మారిన పూనమ్ మరోసారి అలాంటి ట్విట్ తో వివాదస్పదమయ్యారు. గతంలో పవన్ ఫ్యాన్స్ తో గొడవకి దిగి లైమ్ లైట్లోకి వచ్చిన పూనమ్ ఈ సారి వైఎస్ అభిమానుల పై ఫైరయ్యారు.

తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఉద్దేశించి పూనమ్ ఓ ఆసక్తి కర ట్వీట్ చేశారు. ‘ఆంధ్ర, తెలంగాణ అంటూ మన వాళ్లే ఫైట్ చేసుకుంటూ ఉంటే.. ఫైదా ఎవరికబ్బా..? నాకైతే ఏం అర్థం కావడం లేదటూ…రెండు పిల్లుల తగాదాను కోతి తీర్చిన ఫొటోను ట్విట్ చేసి తన చిన్నప్పుడు స్కూల్ స్టోరి రివిల్ చేసింది. అయితే ఇక్కడే ఓ నెటిజన్ ఘాటుగా స్పందించడంతో సీన్ రివర్సయింది.

పూనమ్ కౌర్‌కీ, ఒక నెటిజన్‌కీ మధ్య నడిచిన మాటల యుద్ధం ట్విటర్‌లో సంచలనంగా మారింది. మొదట పూనమ్ ఆంధ్ర, తెలంగాణ ఫైట్ చేసుకుంటూ ఉంటే ఫాయిదా ఎవరికీ అంటూ ట్వీట్ పెట్టడంతో వివాదం మొదలైంది. ‘‘ఆంధ్ర, తెలంగాణ.. మన వాళ్లే ఫైట్ చేసుకుంటూ ఉంటే.. ఫాయిదా ఎవరికి అబ్బా? నాకు అయితే ఏమీ అర్థం కావట్లే.. ఇదిగో ఈ స్కూల్ స్టోరీ గుర్తుకు వచ్చింది’’ అంటూ పిల్లీ.. పిల్లీ కొట్టుకుంటుంటే మధ్యలో కోతి లాభ పడిన ఓ కార్టూన్‌ను పోస్ట్ చేసింది.

దీనిని చూసిన ఓ నెటిజన్.. ‘ఓటుకి నోటు వల్ల ఫాయిదా ఎవరికి.. కనీస మెచ్యూరిటీ లేని పొలిటికల్ ట్వీట్ ఇది… మీరు ఎంత ట్రై చేసిన టీడీపీకి ఒక్క ఓటు పడదు అంటూ కామెంట్ పెట్టాడు. ఈ పోస్టు పెట్టిన నెటిజన్ డీపీగా వైఎస్ పిక్ పెట్టుకున్నాడు. దీంతో పూనమ్.. ‘‘నువ్వు ఎవరి డీపీ పెట్టుకున్నావో.. ఆయన విలువ తియ్యకు. నువ్వు అసభ్యకరమైన భాషను వాడుతున్నావా? సినిమానా పంచెస్ కొట్టడానికి… నీ వ్యాఖ్యలు రోత పుట్టిస్తున్నయంటూ ఘాటుగా స్పందించారు. మనం మాట్లాడిన ప్రతిదాన్ని చాలా కుటుంబాలు, ప్రజలు చూస్తున్నారు’’ అంటూ ఊహించని రీతిలో ఫైరయింది.