Home News Stories

ఆ ఎమ్మెల్యే అడ్డంగా బుక్‌!

క్రికెట్ బెట్టింగ్ కేసులో వైసీపీ ఎమ్మెల్యే

SHARE

పోలీసులు ఎంక్వ‌యిరీకి పిలిచిన‌ప్పుడు నానా యాగీచేశాడా ఎమ్మెల్యే. విప‌క్ష‌పార్టీ ఎమ్మెల్యేని కాబ‌ట్టే ప్ర‌భుత్వం క‌క్ష‌గ‌ట్టింద‌ని, పోలీసులు హ‌ద్దులు దాటుతున్నార‌ని ఓ రేంజ్‌లో ఎగిరాడు. ఇప్పుడేమో సాక్ష్యాల‌న్నీ ప‌క్కాగా ఉండేస‌రికి నోట‌మాట రావ‌డంలేదు. నెల్లూరు రూర‌ల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి క్రికెట్ బెట్టింగ్ కేసులో అడ్డంగా బుక్క‌య్యేలా ఉన్నారు. కేవ‌లం క‌క్ష‌సాధింపేన‌న్న విప‌క్ష‌పార్టీ విమ‌ర్శ‌ల్ని తిప్పికొట్టేందుకు గ‌ట్టి ఆధారాల‌తో ఎమ్మెల్యే పాత్ర‌ని నిరూపించాల‌నుకుంటున్నారు నెల్లూరు పోలీసులు.

క్రికెట్ బెట్టింగ్‌లో బుకీ కృష్ణ‌సింగ్ వ్య‌వ‌హారం మెడ‌కు చుట్టుకోవ‌టంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి రాజ‌కీయ భ‌విష్య‌త్తు మాత్రం సంక్షోభంలో ప‌డేలా ఉంది. ఈ గండంనుంచి ఎలాగోలా ఆయ‌న బ‌య‌ట‌ప‌డ‌తారా..లేదంటే ….

నెల్లూరు రాజ‌కీయాల్లో కోటంరెడ్డికి ఉన్న బేస్‌ని దృష్టిలో పెట్టుకుని అమ‌రావ‌తి నుంచే ఎంక్వ‌యిరీ చేయాల‌నుకుంటోంది ఏసీబీ. క్రికెట్ బెట్టింగ్ కేసులో ప్రధాన బుకీ కృష్ణసింగ్‌తో సంబంధాలున్నాయ‌నేది కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి మీదున్న ఆరోప‌ణ‌. కృష్ణ సింగ్ స్టేట్మెంట్ ఆధారంగా రెండు సార్లు నోటీసులు ఇచ్చినా ఎమ్మెల్యే ఎంక్వ‌యిరీకి మొహం చాటేయ‌డ‌మే కాకుండా ఎస్పీపై ఎదురుదాడికి దిగారు. అయితే ఎమ్మెల్యే ప్ర‌మేయంపై త‌గిన ఆధారాలుండ‌టంతో వీలైనంత తొంద‌ర‌గా చార్జిషీటేసి ఎమ్మెల్యే సంగ‌తి చూడాల‌నుకుంటున్నారు ఏసీబీ అధికారులు.

ఎన్నిక‌ల ముందు క్రికెట్ బెట్టింగ్ కేసులో కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి ఇరుక్కోవ‌డం వైసీపీకి కూడా త‌ల్నొప్పిగానే ఉంది. కుట్రంటూ నిర‌స‌న‌ల‌కు దిగితే రేప్పొద్దున సాక్ష్యాలు గ‌ట్టిగా ఉంటే డిఫెన్స్‌లో ప‌డాల్సి వ‌స్తుంది. అయితే తొంద‌ర‌ప‌డి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాల‌నుకోవ‌డం లేదు పోలీసులు కూడా. నోటీసులిచ్చినా విచార‌ణ‌కు హాజ‌రు కానందుకు మ‌రో సెక్ష‌న్ కింద కేసుపెట్టి చార్జిషీట్ వేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. క్రికెట్ బెట్టింగ్‌లో బుకీ కృష్ణ‌సింగ్ వ్య‌వ‌హారం మెడ‌కు చుట్టుకోవ‌టంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి రాజ‌కీయ భ‌విష్య‌త్తు మాత్రం సంక్షోభంలో ప‌డేలా ఉంది. ఈ గండంనుంచి ఎలాగోలా ఆయ‌న బ‌య‌ట‌ప‌డ‌తారా..లేదంటే నేరం రుజువై చివ‌రికి ప‌ద‌వి కోల్పోవాల్సి వ‌స్తుందా అన్న‌ది నెల్లూరు రాజకీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా ఉంది. ఏదేమ‌యినా ఈ కేసులో నేర నిర్ధారణలో శాస్త్రీయ ఆధారాలే కీలకం కాబోతున్నాయి.