Home News Politics

చింతమనేని పై వైసీపీ సోషల్ వార్…!

SHARE

చింతమనేనిని మరోసారి వివాదంలోకి లాగింది విపక్ష వైసీపీ పార్టీ. గ్రామాదర్శినిలో గతంలో చింతమనేని చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి రచ్చ చేస్తుంది వైసీపీ సోషల్ మీడియా. దళితుల మనోభావాలను కించపరిచేలా తాను మాట్లాడినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఇందుకు నిరసనగా ఆయన ఏలూరులో అనుచరులతో కలిసి ధర్నాకు దిగారు.

తన పై వచ్చిన ఆరోపణలను నిరూపిస్తే దేనికైన సిద్దమే అని సవాల్ విసిరారు చింతమనేని. తనను అనవసరంగా వివాదాల్లోకి లాగడం వైసీపీకి అలవాటుగా మారిందన్నారు. .. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి దుష్ప్రచారాలకు దిగుతున్నారంటూ ఆరోపించారు. నవంబర్ లో శ్రీరామవరం సభలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి వాటిని వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారని ఈ వీడియోలపై ఆయన జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.