Home News Politics

వైసీపీ కొత్త ప్రయత్నం…పీకే టీం స్ట్రాటజీ సక్సెస్ అవుతుందా…?

SHARE

వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ కొత్త ప్యూహాలకు పదునుపెడుతుంది. ఒక పక్క పార్టీ చీఫ్ జగన్ శంఖారావం పేరుతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం మొదలు పెట్టేశారు. ఈ ఎన్నికలు వైసీపీకీ చావో రేవోగా మారడం టీడీపీ కొత్త పథకాలతో జనంలోకి వెళ్తుండటంతో పార్టీ అధినేత జగన్ రూటు మార్చాడు. ప్రజలకు నేరుగా చేరువయ్యే ప్లాట్ ఫామ్ గురించి ఆలోచించి పీకే టీం స్ట్రాటజీలో భాగంగా ఈ మధ్య సక్సేస్ రేషియో ఎక్కువ ఉన్న తటస్థుల సమావేశాలకు శ్రీకారం చుట్టింది.దీంతో పాటు పార్టీ అధినేత స్వయంగా క్యాడర్ తో మమేకం అయి సలహాలు,సూచనలు స్వీకరించడం ఇవన్ని పార్టీలో కొత్తపోకడలకు తెర తీసింది.

వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అన్ని వ్యూహాలకు పదును పెడుతుంది. తటస్థులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని వారిని ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. మరో పక్క జగన్ ను స్ఫూర్తిగా తీసున్న పార్టీవర్గాలు తాజాగా ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టాయి. హైదరాబాద్ లో ఉన్న వారు నేరుగా తమ ప్రాంతానికి వెళ్ళి వైసీపీకి ఓట్లు వేయించాలన్నది ఈ మీటింగ్ ప్రధాన లక్ష్యం. ఇందులో వివిధ వర్గాలకు చెందిన కడప జిల్లా వాసులే పాల్గొనడం విశేషం.

ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కులాలు, మతాల వారీగా, వర్గాల వారీగా సమ్మేళనాలు చేపట్టి టిఆర్ఎస్ సక్సెస్ అయ్యింది. ఇదే తరహాలో ప్రయత్నం చేపట్టింది వైసీపీ. ముందుగా కడప జిల్లాలోని పులివెందుల, మైదుకూరు, కమలాపురం, జమ్మల మడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్, నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం ప్రారంభించింది వైసీపీ. పీకే టీం పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి,జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు ఈ సదస్సుకు వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిన కడప జిల్లా వాసులతో ముచ్చటించారు. ఈ కొత్త విధానం బాగుందని హర్షం వ్యక్తం చేస్తుంది వైసీపీ కింది స్థాయి క్యాడర్‌.

ఇక జగన్‌ పాదయాత్ర తర్వాత మొదలుపెట్టిన సమరశంఖారావం సభలో కూడ కొత్త స్ట్రాటజీలకు తెరతీశారు. ఏదో బహిరంగ సభకి వచ్చాం మాట్లాడం వెళ్ళాం అని కాకుండా సభ పూర్తైన తర్వాత నేరుగా జనంలోకి వెళ్ళి పార్టీలోని సమస్యల పై అడిగి తెలుసుకుని స్పందిస్తున్నాడు వైసీపీ చీఫ్ జగన్. స్లిప్పులలో నియోజకవర్గంలోని సమస్యలు,పార్టీ పరమైన సమస్యలు రాసివ్వమని అక్కడే వాటిని చదువుతూ పరిష్కారం చూపిస్తున్నాడు. ఇక ప్రతి జిల్లాలో మేథావులతో,పార్టీ సానుభూతిపరులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని సవివరంగా నోట్ చేసుకుంటున్నారు విపక్ష పార్టీ అధినేత.

ఈ విషయాలన్ని గమనించిన పార్టీ క్యాడర్ పార్టీ అధినేత జగన్ స్వయంగా తమ మాటను రిసీవ్ చేసుకోవడం,సలహాలను స్వయంగా స్వీకరించడం చూసి రానున్న ఎన్నికల్లో తమకు తిరుగులేదని చెబుతున్నాయి.