Home News Politics

వైసీపీలో రాధా రగడ…

SHARE

కృష్ణా జిల్లా వైసీపీలో రాజకీయ రగడ మళ్ళీ రాజుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజయవాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసే విషయంలో మల్లాది విష్ణు, రాధా మధ్య ఎప్పటి నుంచో ఆదిపత్య పోరు నడుస్తుంది. అయితే సెంట్రల్ సీటు విష్ణు కే దక్కుతుందన్న స‌మాచారంతో మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా వర్గం ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌ంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాధాను సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో కాకుండా అవనిగడ్డ నుంచి కాని మ‌చిలీప‌ట్నం ఎంపిగా కాని పోటీ చేయ‌మ‌ని వైసిపి బాస్ నుంచి సిగ్నల్స్ వచ్చాయన్న సమాచారంతో రాధా అనుచరులు భగ్గుమన్నారు. నియోజక వర్గంలోని వంగవీటీ అభిమానులు రాధా ఇంటికి చేరుకుని హైడ్రామా సృష్టించారు. రాధాకు జ‌రుగుతున్న అన్యాయానికి నిర‌స‌న‌గా కొంద‌రు రాధా అనుచ‌రులు పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకునేందుకు ప్ర‌య‌త్నించ‌టంతో రాధా ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.

దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన వైసీపీ అధిష్టానం యలమంచిలి రవి ని హుటాహుటినా రాధా ఇంటికి పంపి వివాదం సద్దుమనిగేలా ప్రయత్నించింది. నిన్న జరిగిన పార్టీ సమావేశం నుంచి రాధా అర్ధాంతరంగా బయటకి రావడంతో పార్టీకి,రాధాకి మధ్య ఎదో గ్యాప్ వచ్చిందనుకున్న ఆయన వర్గం ఇంటి వద్ద ఉన్న పార్టీ ఫ్లెక్సీలను ధ్వసం చేసి పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంత‌కుముందే రాధా సోద‌రుడు వంగ‌వీటి శ్రీ‌నివాస‌రావు పార్టీకి రాజీనామా చేయ‌టంతో టెన్ష‌న్ మ‌రింత పెరిగిపోయింది.

అసలే కృష్ణా జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న పార్టీలో ఈ రేంజ్ లో ఉన్న వర్గ విభేదాలను వైసీపీ అధినేత ఎలా సెట్ చేస్తారో చూడాలి….