Home News Politics

జగన్ కి తలనొప్పిగా మారిన బంధువుల ఇంటి పోరు…!

SHARE

వాళ్లిద్దరూ ప్రతిపక్ష పార్టీ వైసీపీలో ముఖ్య నాయకులు.. సొంత బావా ,బావమరుదులు కూడా… ఇంకా చెప్పాలంటే.. పార్టీ అధినేత జగన్ కి దగ్గరి బంధువులు… అయితే ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది… పార్టీ వ్యవహారాల్లోనూ ఒకరు ఎడ్డెమంటే.. మరొకరొ తెడ్డెమంటున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు? వారి మధ్య అంత గ్యాప్‌ ఎందుకొచ్చిందంటారా?

ప్రకాశం జిల్లా వైసీపీలో ముఖ్య నాయకులు వై.వి.సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి.. వాళ్లిద్దరు సొంత బావాబావమరుదులు… జగన్ కి దగ్గరి బంధువులైన ఆ ఇద్దరి మధ్య కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది… పార్టీ వ్యవహారాల్లో ఇద్దరూ ఒకరిపై మరొకరు పై చేయి సాధించాలని చేస్తున్న ప్రయత్నాలతో వారి మధ్య గ్యాప్‌ పెరిగిపోతోందంట .. ఆ క్రమంలో ఒకరికొకరు చెక్ పెట్టుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేసుకుంటున్నారట..కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో బాలినేని, వైవి సుబ్బారెడ్డిలు కలిసే జిల్లాలో చక్రం తిప్పారు. అయితే వైసిపిలోకి వచ్చాక సీన్‌ మారింది.. ఆధిపత్య పోరుతో ఇద్దరి మధ్య వచ్చిన విభేదాలు తారాస్థాయికి చేరాయని ఆ పార్టీ నేతల టాక్… 2014 ఎన్నికల రిజల్ట్ ఇద్దరి మధ్య చిచ్చురేపిందట. ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి వరుసగా నాలుగు సార్లు గెలుపొందారు…

అయితే 2014 ఎన్నికల్లో బాలినేని ప్రత్యర్థి దామచర్ల జనార్థన్ చేతిలో ఓటమి పాలయ్యారు… దానికి కారణం బావ వై.వి.సుబ్బారెడ్డేనని బాలినేని భావిస్తున్నారంట … ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్‌ నుంచి వైవి.సుబ్బారెడ్డి పోటీ చేయడం వల్లే తాను ఓటమి పాలయ్యానని బాలినేని ఫీలవుతున్నారంట .. దాంతో అప్పటి నుండి బావా,బావమరుదులు ఎడమొహం పెడమొహంగా ఉంటూ వస్తున్నారు … ఇద్దరి మధ్య విభేదాలు ఎంత వరకు వెళ్లాయంటే … పార్టీ కార్యక్రమమైనా సరే ఒకరి ఫొటో ఉన్న ఫ్లెక్సీలో మరొకరి ఫోటో కనిపించడం లేదు… ఎవరి గ్రూపు వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు..

ప్రస్తుతం ఎన్నికలు సమీపించడంతో గత ఎన్నికల్లో తన ఓటమికి కారణమైన వైవి.సుబ్బారెడ్డికి చెక్ పెట్టేందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారట… ఒంగోలు పార్లమెంట్ స్థానం నుండి వైవి.సుబ్బారెడ్డి పోటీ చేయకుండా కొత్త వారిని తెరమీదకు తీసుకువచ్చేందుకు బాలినేని ప్రయత్నిస్తున్నారట… అందులో భాగంగా ఇటీవల దర్శిలో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో బాలినేని తమన మనసులోని మాటని బయటపెట్టేశారు. ..దర్శి అసెంబ్లీ నుండి పోటీకి తప్పుకున్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ని ఒంగోలు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయిస్తామంటూ బాలినేని ప్రకటించారు …

బాలినేని వ్యాఖ్యలతో వైవి.సుబ్బారెడ్డి వర్గం నేతలు ఫైర్ అవుతున్నారు … బాలినేని పై జగన్‌కి ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం .. ఎంపి సీటు ని ఎమ్మెల్యే స్థాయి బాలినేని ఎలా నిర్ణయిస్తారని వైవి సుబ్బారెడ్డి వర్గం పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నారు ..ఏదేమైనా పార్టీలో ముఖ్య నేతలుగా ఉన్న ఈ బావబావమరుదుల మధ్య ఏర్పడిన విభేదాలు… రానున్న ఎన్నికల సమయానికి ఎలా మారుతాయోనని వైసీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి..