Home Entertainment Cinema

‘యాత్ర’ కు రంగం సిద్ధం….!

SHARE

దివంగత నాయకుడు మాజీ ముఖ్యమంత్రి డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలోని కీలక ఘట్టాల నేపథ్యంలో తెరకెక్కుతున్న `యాత్ర` ఫిబ్రవరి 8న రిలీజ్ కి రెడీ అవుతుంది. ‘యాత్ర’ సినిమాలో కేవలం YSR పాదయాత్ర కు ఇన్స్ పైర్ చేసిన అంశాలే కాదు, రాజకీయాల వైపు ఆయన్ని ఆకర్షించేలా చేసిన మరెన్నో సంఘటనలు ఉండబోతున్నాయి. సినిమాలో జగపతిబాబు నటిస్తున్న ‘రాజారెడ్డి’ రోల్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. మరీ ముఖ్యంగా మమ్ముట్టి, జగపతి బాబు కాంబినేషన్ లో ఉండబోయే సీన్స్ పై సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కర్షన్స్ నడుస్తున్నాయి.

సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో వైఎస్ అభిమానుల్లో ,వైసీపీ కార్యకర్తల్లో ఉత్కంఠ పెరిగిపోయింది. దేశ రాజకీయాల్ని శాసించిన ఒక గొప్ప నాయకుడి జీవితంలో కీలక ఘట్టాల్ని తెరపై చూడాలన్న ఆసక్తి అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లోనూ వేగం పెంచింది. తొలిగా `యాత్ర` ప్రీరిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ ఎన్- కన్వెన్షన్ హాల్ లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. భారీగా వైయస్ జగన్ అభిమానుల సమక్షంలో ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా – శశి దేవిరెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు.

ఈ సినిమాలో దివంగత మాజీ ముఖ్యమంత్రి Y.S. రాజశేఖర్ రెడ్డి కి తండ్రి గా జగపతి బాబు కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ తో YSR అభిమానులలో క్యూరియాసిటీ రేజ్ చేసిన మేకర్స్, సినిమాలో జగపతి బాబు క్యారెక్టర్ తో పాటు, లుక్స్ ని రివీల్ చేసి, సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతున్నారు. మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో జగపతిబాబు,సుహాసిని,అనసూయ,పోసాని,సచిన్ ఖేద్కర్,రావు రమేష్ ,వినోద్ కుమార్ తదితరులు నటించారు. వాస్తవానికి ఈ సినిమా ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉన్నా రకరకాల కారణాలతో రిలీజ్ అంతకంతకు వాయిదా పడింది.

ముందుగా సినిమాని 2018 డిసెంబర్ 21కి రిలీజ్ అనుకున్నారు… ఆ తర్వాత ఈ జనవరి 9న రిలీజ్ చేయాలని భావించారు. సంక్రాంతి బరిలో థియేటర్ల సమస్య వల్ల వాయిదా పడింది. చివరిగా ఫిబ్రవరి 8న రిలీజ్ తేదీని లాక్ చేసింది టీమ్. ఇక ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ బయోపిక్ రిలీజవుతున్న సమయంలోనే రిలీజ్ చేయాలనుకున్నా అది ఎందుకో వీలు పడలేదని డైరక్టర్ మహి.వి.రాఘవ్ వెల్లడించారు.