Home Entertainment Cinema

ఇక్కడ అరిస్తే ఇడుపులపాయలో వినిపించాలి…!

SHARE

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర చిత్రం తెరకెక్కుతోంది. ఫిబ్రవరి 8 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్ . రాజశేఖర్ రెడ్డి 2003లో రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పాదయాత్ర కీలక అంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. వైఎస్ఆర్ పాత్రలో మలయాళీ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు.

ఇప్పటికే ట్రైలర్, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మమ్ముట్టి వైఎస్ఆర్ లాగా హావ భావాలు పలికిస్తున్నారు. దర్శకుడు మహి వి రాఘవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైఎస్ఆర్ అభిమానులని ఆకట్టుకునే ప్రసంగం చేశారు. యాత్ర చిత్రం విషయంలో తాను పెద్దగా కష్టపడింది ఏమి లేదన్నారు డైరక్టర్ మహి వి రాఘవ్. మమ్ముట్టి ఎలా నటించాలో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వైఎస్ అభిమానుల జోష్ లో ఈలలు కేకలు ,అరుపులతో హోరెత్తించారు. ఇవి ఇడుపులపాయలో వినిపించాలి అని రాఘవ్ అభిమానులని మరింతగా ఉత్తేజ పరిచాడు. మీ అరుపులు నాకు వినిపిస్తున్నాయి. కానీ అమరావతిలో కూడా వినిపించి నిద్రపోతున్న వాళ్ళు లేవాలి అంటూ వ్యాఖ్యానించారు.

వైఎస్ఆర్ ను నేను ఎప్పుడు కలవలేదు. అనుకోకుండా ఈ చిత్రం చేశా. మా అమ్మది కడప జిల్లానే అని రాఘవ్ తెలిపాడు. కడప వాళ్లకు నొప్పి భరించే శక్తి ఉంటుంది అని రాఘవ్ తెలిపారు. జగనన్నని ఈ చిత్రం చేస్తున్న సమయంలో గోదావరి జిల్లాలో కలిశాను. పాదయాత్ర మీద సినిమా చేస్తున్నా అని చెప్పా. అయన ఒక మాట అన్నారు. మా నాయన ఏం చేశాడో అది చూపించు చాలు.. చేయనిది కూడా చూపించి క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని జగన్ తనతో చెప్పినట్లు మహి వి రాఘవ్ తెలిపారు. ట్రైలర్ చూపించేందుకు మరోమారు కలిశా. అన్నా మీరు సినిమా కూడా చూడాలి అని అడిగా. మీ నాయకుడి కథ మీరు చెబుతున్నారు. నన్నేం చేయమంటావ్ అని జగన్ తనతో అన్నట్లు రాఘవ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో తెలిపారు.

ఇక అతిథిగా ఎవర్ని పిలవాలి ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం చీఫ్ గెస్ట్ గా ఎవర్ని పిలవాలి అని అని అనుకుంటున్న సమయంలో రాజశేఖర్ రెడ్డి అభిమానులని పిలిస్తే చాలు అని తాను నిర్మాతలకు చెప్పినట్లు రాఘవ్ అన్నారు. కథ తయారు చేసే సమయంలో తాను ఎక్కువగా కష్టపడ్డానని, షూటింగ్ మాత్రం ప్రశాంతంగా జరిగిందని రాఘవ్ తెలిపారు. ఫిబ్రవరి 8న యాత్ర చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.