Home News

వాట్సప్‌లో మరో సూపర్ ఫీచర్…!

SHARE

200 కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకున్న వాట్సప్ మరో సరికొత్త ఫీచరని అందుబాటులోకి తెచ్చింది. గతంలో కేవలం మెసేజ్‌లు ,ఫొటోలకు పరిమితమైన వాట్సప్ క్రమంగా తన పరిధిని పెంచుకుంటూ పోతుంది. వాయిస్‌ కాలింగ్‌, వీడియో కాలింగ్‌లతో పాటు డబ్బులు ట్రాన్సపర్‌ చేసుకునే సదుపాయం కూడా వినియోగదారులకు అందించింది. ఇలా రోజు రోజుకు పరిధిని పెంచుకున్న వాట్సప్ మరో కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చింది.

వాయిస్‌ మెసేజ్‌లను వాట్సప్‌ ద్వారా పంపించడం కామన్. కాని ఒకసారి సౌండ్‌ రికార్డ్‌ చేసిన తర్వాత దాన్ని సరి చూసుకునే అవకాశం లేదు. అందుకే ఒకసారి వాయిస్‌ రికార్డ్‌ చేసుకున్న తర్వాత దాన్ని విని ఓకే అనుకుంటే పంపించే ఆప్షన్‌ను తీసుకు వచ్చారు. ప్రస్తుతం బీటా వర్షన్‌లో ఈ ఆప్షన్‌ వచ్చింది. రెండు వారాల్లో రెగ్యులర్‌ వినియోగదారులకు ఇది అందుబాటులోకి రాబోతుంది. ఇప్పటికే వాట్సప్ మెసేజ్ ను పంపిన తర్వాత కూడ నిర్ణీత సమయంలోగా డిలీట్ చేసే అవకాశం కల్పించింది వాట్సప్. మొత్తానికి వాట్సప్‌ నుండి వస్తున్న ఫీచర్స్‌ వినియోగదారులను మరింత ఆకట్టుకుంటున్నాయి.