Home Women Health

స్మార్ట్ ఫోన్ యాప్స్ తో బరువు తగ్గడం అంత ఈజీకాదు

SHARE

స్మార్ట్ ఫోన్స్ యాప్స్ తో బరువు తగ్గడం అంత ఈజీకాదు:బరువు తగ్గటానికి కేవలం స్మార్ట్‌ఫోన్‌ యాప్స్‌ మీదనే ఆధారపడుతున్నారా? అయితే మరోసారి ఆలోచించుకోండి. వ్యాయామం, కేలరీల వంటి వాటి తీరును పసిగట్టే స్మార్ట్‌ఫోన్‌ యాప్స్‌.. యువతీయువకులు బరువు తగ్గటంలో ఏమంత ప్రభావం చూపటం లేదని తాజా అధ్యయనం పేర్కొంది.

లైఫ్ స్మార్ట్ అయిపోయింది. అన్నింటికి స్మార్ట్ ఫోన్ మంత్రం పఠిస్తున్నారు. బరువు తగ్గటానికి కేవలం స్మార్ట్‌ఫోన్‌ యాప్స్‌ మీదనే ఆధారపడుతున్నారా? అయితే మరోసారి ఆలోచించుకోండి. వ్యాయామం, కేలరీల వంటి వాటి తీరును పసిగట్టే స్మార్ట్‌ఫోన్‌ యాప్స్‌.. యువతీయువకులు బరువు తగ్గటంలో ఏమంత ప్రభావం చూపటం లేదని తాజా అధ్యయనం పేర్కొంది.

స్మార్ట్ ఫోన్ యాప్స్ తో బరువు తగ్గడం అంత ఈజీకాదు

18-35 ఏళ్ల వయసువారిలో 35% మంది అధికబరువు లేదా వూబకాయులేనని.. ఇది పెద్ద ప్రజారోగ్య సమస్యని అధ్యయన నేత, డ్యూక్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన లారా పి.స్వెట్కే తెలిపారు. ఈ వయసువాళ్లు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌ల వంటి అధునాతన పరికరాలతో ఎక్కువగా గడుపుతుంటారు.

అందువల్ల యాప్స్‌ వంటి వాటితో వూబకాయ సంబంధ వ్యాధులను నివారించుకునే అవకాశముందని భావిస్తుంటారు. కానీ ఇలాంటి యాప్స్‌ అంతగా ప్రభావం చూపటం లేదని స్వెట్కే వివరించారు. అంతకన్నా శిక్షకుల సమక్షంలో బరువు తగ్గటానికి ప్రయత్నం చేసినవారిలో మెరుగైన ఫలితం కనబడిందని తెలిపారు. అయితే రెండేళ్ల తర్వాత శిక్షకుల పద్ధతితోనూ ఆశించిన ఫలితం ఉండటం లేదన్నారు.