Home Entertainment Cinema

వినాయక చవితి రోజు హీరో గోపీచంద్ కు గుడ్ న్యూస్…

SHARE

వినాయక చవితి రోజున హీరో గోపిచంద్ కు ఆయన భార్య రేష్మా మరిచిపోలేని బెస్ట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఆయన భార్య పండంటి బాబుకు జన్మనిచ్చారు. వినాయక చవితి రోజున తండ్రి అవ్వడంతో గోపీచంద్ ఫూల్ హ్యాపీ మూడ్ లో ఉన్నారు.

గోపిచంద్ వైఫ్ రేష్మా గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్లో బేబి బాయ్ కి జన్మనిచ్చారు. వినాయక చవితి రోజున తండ్రి అయ్యాయని గోపీచంద్ ఆనందం వ్యక్తం చేశారు. ‘మాకు మళ్లీ బాబు పుట్టాడు. వినాయక చవితి పండుగ రోజున ఇంతకంటే ఇంకేం ఉండదు’ అని ట్వీట్టర్ లో తన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.


గోపీచంద్‌, రేష్మ 2013 మే నెలలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి 2014 అక్టోబర్లో మొదటి అబ్బాయి పుట్టాడు. అతడికి గోపీచంద్ తండ్రి పేరు కలిసి వచ్చేలా విరాట్‌ కృష్ణ అని పేరు పెట్టారు. గోపీచంద్ 8 ఏళ్ల వయసులోనే ఆయన తండ్రి కృష్ణ మరణించారు. చెన్నైలో చదువుకున్న ఆయన రష్యాలో ఇంజినీరింగ్ చదివారు. నటుడు శ్రీకాంత్ బంధువుల అమ్మాయి అయిన రేష్మా బీటెక్ చదివారు. త్రీడీ యానిమేషన్‌, విజువల్ ఎఫెక్ట్స్‌లపై ఆమెకు మంచి నాలెడ్జ్ ఉంది.