Home News Politics

బెజవాడలో షురూ అయిన క్యాస్ట్ పాలిట్రిక్స్…!

SHARE

బెజవాడలో మరో సారి క్యాస్ట్ పాలిటీక్స్ తెరమీదకొచ్చాయి. సామాజీక వర్గాల లెక్కల్లో అగ్రస్థానంలో నిలిచే కృష్ణా జిల్లాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ పై కీలక పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు పడుతోంది వైసీపీ.. కృష్ణాజిల్లా రాజకీయాల్లో ఈ సారి కమ్మవర్సెస్ కమ్మ నడుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు నలుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించారు. నాలుగు చోట్ల వైసీపీ నుంచి ఓడిపోయింది ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలు.. అందుకే ఈ సారి ప్లాన్ మార్చాలని నిర్ణయించింది వైసీపీ…

ఎక్కడైతే ఓడిపోయామో అక్కడ అదే కమ్మసామాజిక వర్గానికి చెందిన నేతలను రంగంలోకి దింపాలని బావిస్తోంది ఫ్యాన్ పార్టీ . ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో బలమైన కమ్మ అభ్యర్థులను నియమించి రంగంలోకి దింపింది. అందుకే కమ్మ కులానికి చెందిన నేతలు ఎమ్మెల్యేలుగా గెలిచిన చోట అదే సామాజికవర్గాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఆ పార్టీ… ఆ సామాజిక వర్గాన్ని ఎదుర్కోవాలంటే అదే కులానికి చెందిన నేతలను నిలబెట్టాలని నిర్ణయం తీసుకుంది… గత ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం బలంగా ఉన్నచోట వేరే కులాలకు చెందిన వారిని నిలబెట్టి తప్పుచేశామని వైసీపీ బావిస్తోందట. అందుకే ఈసారి ఆ తప్పుచేయకుండా కమ్మవారి మీద అదే కమ్మవారిని బరిలోకి దించుతోంది..దీంతో ఇప్పుడు కృష్ణాజిల్లో ఈ సారి పార్టీల పేర్ల కంటే కమ్మ వర్సెస్ కమ్మ అన్నదే ఎక్కువగా వినిపిస్తోంది.

ముఖ్యంగా మైలవరం నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి దేవినేని పై ఓడిపోయిన జోగిరమేష్ గౌడసామాజిక వర్గానికి చెందిన వ్యక్తి… ఆ నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గానికి మంచి ఓట్లే ఉన్నప్పటికీ అక్కడ పట్టున్నది మాత్రం కమ్మ సామాజికవర్గానికే కావడంతో జోగి రమేష్ ఓఢిపోయారు. గత చరిత్ర చూసినా సరే ఆ నియోజకవర్గం ఏర్పడి నుంచి ఇప్పటి వరకూ అందరూ కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇక్కడ వీరిపై ఓడిపోయిన అభ్యర్థులు కూడా కమ్మ సామాజికవర్గానికి చెందినవారే.. అయితే గత ఎన్నికల్లో మాత్రం వైసీపీ కమ్మ అభ్యర్థిని కాకుండా గౌడ సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వడంవల్ల ఓట మి పాలయింది. అందుకే ఈ సారి ఆ తప్పు చేయకూడదని బావించిన ఆ పార్టీ అధిష్టానం వసంత కృష్ణప్రసాద్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏడాది ముందే ప్రకటించింది.

ఇక గన్నవరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వల్లభనేని వంశీ టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయనపై గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు కాపు సామాజికవర్గానికి చెందిన డాక్టర్ దుట్టా రామచంద్రరావు… నియోజకవర్గంలో ఆయనకు మంచి పేరున్నప్పటికీ వల్లభనేని వంశీకి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా ఆయన విజయం సాధించలేకపోయారు. అందుకే ఈసారి అక్కడ వల్లభనేని వంశీని ఎదుర్కునేందుకు అదే సామాజికవర్గానికి చెందిన యార్లగడ్డ వెంకట్రావును ఏడాది ముందు నుంచే బరిలోకి దింపింది వైసీపీ.. ఎన్నారై అయిన యార్లగ్గడ్డ అయితే వల్లభనేనిని సమర్ధవంతంగా ఎదుర్కోగలిగిన సత్తా ఉందని బావిస్తోంది వైసీపీ…ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలు కావడంతో ఇప్పుడు అక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది.

విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి…ఇక్కడ గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన కాపు సామాజికవర్గానికి చెందిన వంగవీటి రాధాకృష్ణ పరాజయం పాలయ్యారు. నిజానికి ఆ నియోజకవర్గ పరిధిలో కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కమ్మ అభ్యర్ధే విజయం సాధించారు. అంతకుముందు అంటే 2009 ఎన్నికల్లోనూ కమ్మ సామాజికవర్గానికి చెందిన యలమంచిలి రవి ప్రజారాజ్యం పార్టీ నుంచి విజయం సాధించారు. అందుకే ఈసారి ఆ నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ మీద పోటీకి మళ్లీ కమ్మ అభ్యర్థినే నియమించాలని బావిచింది. అందుకే ఈ సారి వంగవీటికి ఛాన్స్ లేదని చెప్పడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. అదే క్రమంలో వైసీపీలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవిని వైసీపీ తరఫున బరిలోకి దించేందుకు ప్లాన్ చేసింది ఫ్యాన్ పార్టీ అధిష్టానం.
ఇక పెనమలూరు నియోజకవర్గంలోనూ అదే రకమైన పరిస్థితి… గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి బోడెప్రసాద్.. ముప్పై మూడువేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అప్పుడు టీడీపీ మీద ఓడిపోయింది బీసీ సామాజికవర్గానికి చెందిన విద్యాసాగర్ రావు… పునర్విభజనలో కంకిపాడు నియోజకవర్గం నుంచి విడిపోయి ఏర్పడిన నియోజకవర్గం ఇది… 2009 ఎన్నికల్లో యాదవ సామాజికవర్గానికిచెందిన కొలుసుపార్ధసారధి 177ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. అప్పుడు ఓడిపోయింది కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన చలసాని పండు… సాధారణంగా ఇక్కడ కమ్మ సామాజికవర్గానికి పట్టు ఎక్కువ..గతంలో కంకిపాడు నియోజకవర్గం ఉన్నప్పుడు ఆ నియోజకవర్గం నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన దేవినేనినెహ్రూ ఐదుసార్లువరుసగా, యలమంచిలినాగేశ్వరరావు ఒకసారి గెలుపొందారు. అప్పుడువీరిద్దరి మీదా ఓడిపోయింది కూడా కమ్మసామాజికవర్గానికి చెందిన వారే కావడం విశేషం..

అయితే గత ఎన్నికల్లో కాస్త ట్రెండ్ మార్చి వైసీపీ బీసీ అభ్యర్థి విద్యాసాగర్ ను బరిలోకి దింపి ఘోరంగా విఫలమయింది. అందుకే ఈసారి ఆ తప్పు చేయకుండా పెనమలూరు నుంచి బలమైన కమ్మ అభ్యర్థిని నిలబెడితే ఎలా ఉంటుందనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇదే నియోజకవర్గం నుంచి గతంలో కాంగ్రెస్ తరఫున గెలిచి మంత్రి కూడా అయిన పార్ధసారధి ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నారు..ఆయన ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. కులాల ఈక్వేషన్ లో వైసీపీ ఇక్కడి నుంచి కమ్మ కులం నుంచిబలమైన అభ్యర్థి కి ఇవ్వాలా లేక పార్ధసారధి కి ఇవ్వాలా అన్న అంశం సస్పెన్స్ లో ఉంది.

మొత్తం మీద కృష్ణాజిల్లాల్లో కమ్మవర్సెస్ కమ్మ నడుస్తోంది. అటు ఆర్థిక పరంగానూ ఈ అభ్యర్థులు బలమైన వారు కావడంతో ఈ సామాజికవర్గ ఈక్వేషన్స్, గెలుపు పై ఆసక్తి నెలకొంది.