Home Entertainment Cinema

వీర‌ వ‌నిత‌గా పోర్న్ స్టార్…

SHARE

శృంగార తారగా ప్రకంపనలు సృష్టించి యువతకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన సన్నిలియోన్ మరో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయింది. హాలివుడ్ పోర్న్ స్టార్ గా ఊపేసిన అమ్మడు అటు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి స్పీడ్ కంటిన్యూ చేసింది. అడప దడపా ఇతర భాషల్లో ఐటమ్ సాంగ్స్ కి పరిమితమైన సన్ని కన్నడ సినిమాలో ఎంట్రీ ఇచ్చి కాంట్రవర్సీకి కారణమైంది.

ప్రపంచవ్యాప్తంగా పార్న్ స్టార్ గా పాపులర్ అయిన అమ్మడు కర్ణాటకలో వీరనారిగా కొలిచే ‘వీరమహదేవి’ క్యారక్టర్ కి కమిట్ అయింది. అయితే ద‌క్షిణాదిన అవ‌కాశాలు రావ‌డంతో ఈ మధ్య డోస్ త‌గ్గించిన ఈ అమ్మడు ప్ర‌స్తుతం క‌న్న‌డ భాష‌లో `వీర‌మ‌హాదేవి` అనే పిరియాడిక్ సినిమాలో న‌టిస్తోంది. దాదాపు 100 కోట్ల బ‌డ్టెట్ తో ఈ సినిమా తెరక్కెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో వీర‌వ‌నిత అనే పాత్ర‌లో స‌న్నీ క‌నిపించ‌నుది. అయితే ఆ పాత్ర‌కు స‌న్నిలీయోన్ ఎంపిక చేయ‌డం స‌బ‌బు కాద‌ని క‌న్న‌డిగులు ఫైర్ అవుతున్నారు.

అసలు సన్ని పై 100 కోట్ల బడ్జెట్ తో ఇలాంటి సినిమా అంటే ఎలా డేర్ చేశారన్న డౌట్స్ కి ఈ సినిమా ప్రోడ్యూసర్ నింపాదిగా సమాధానం ఇస్తున్నాడు. స‌న్నీది వ‌ర‌ల్డ్ వైడ్ గా పాపులారిటీ ఉంది కాబ‌ట్టి…బిజినెస్ స‌మ‌స్య ఉండ‌ద‌ని నిర్మాత‌లు అంత ఖ‌ర్చు చేస్తున్నారట. అన్ని భాషాల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తే వంద కోట్లు వసూలు చేయడం పెద్ద విషయం కాదనుకుంటున్నారు ఈ మూవీ ప్రోడ్యూసర్స్.

వీర‌నారిగా కొలిచే మ‌హాదేవి పాత్ర‌కు స‌న్నిని ఎలా తీసుకుంటారంటూ రచ్చ స్టార్ట్ చేసింది కర్ణాటక రక్షణ వేదిక. ఏకంగా ఈసినిమా కి వ్యతిరేకంగా బెంగళూరులో భారీ ప్రదర్శనను నిర్వహించారు. ఓ పోర్న్ స్టార్ ను దైవంగా కొలిచే ఒక పాత్ర‌కు ఎలా ఎంపిక చేస్తారంటు కన్నడ జనాలు కారాలు,మిరియాలు నూరుతున్నారు. ఈ సినిమా నుంచి సన్నిని తొలగించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ లు ఇస్తున్నారు కన్నడ జనాలు. మరీ వీర వనిత గా సన్నిని చూస్తామ లేదా అన్నది కొన్ని రోజుల్లో తేలనుంది.