Home News Stories

వట్టి వసంత్‌‌ కుమార్ కి వైసీపీలో లైన్ క్లియర్ అయిందా…?

SHARE

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సీనియర్‌ నేత వట్టి వసంతకుమార్‌ కీలక నిర్ణయం తీసుకోతున్నారా…ఇప్పటివరకు జనసేనకి జై కొడతారనుకున్న వట్టి వసత్ రూటు మార్చారా…గత ఎన్నికల సమయంలో స్థబ్దుగా ఉన్న వసంత్ కుమార్ మరోసారి రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. పొలిటికల్ జర్నీ పై కన్ప్యూజన్ లో ఉన్న వసంత్ ఒక క్లారీటీకి వచ్చినట్లు తెలుస్తుంది. వచ్చే నెల మొదటివారంలో తన అనుచరులతో సమావేశమవుతున్న మాజీమంత్రి పొలిటికల్ ఫ్యూచర్ పై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది…

పశ్చిమగోదావరి జిల్లాలో సీనియర్ పొలిటికల్ లీడర్ వట్టి వసంతకుమార్ . సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్‌నే నమ్ముకుని ఉన్న ఆయన ఈ మధ్యనే చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. తెలుగుదేశంతో పొత్తు ఏమాత్రం శ్రేయస్కరం కాదని, పార్టీలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన తమలాంటి వారికి ఏ మాత్రం అంగీకారం కాదని అప్పట్లోనే వసంత్‌ తెగేసి చెప్పారు. అప్పటి నుంచి తన శ్రేయోభిలాషులతో అంతర్గత చర్చలు కొనసాగిస్తూనే, ఉంగుటూరు నియోజక వర్గానికి చెందిన అభిమానులు, జిల్లాలో తనతో సాన్నిహిత్యంగా ఉంటున్న కొందరు నేతలతో వచ్చే నెలలో భేటీ కావాలని తాజాగా నిర్ణయించారు.

ఈ భేటీలోనే తన భవితవ్యాన్ని నిర్ధారించుకునే వీలుగా కసరత్తు ప్రారంభించారు వట్టి. జనసేన పార్టీకి చేరువ అవుతారా.. లేదా వైసీపీకి దగ్గర కానున్నారా..? అనే అంశాలపై జిల్లాలో సాగుతున్న ప్రచారానికి నేరుగానే పుల్‌స్టాప్‌ పెట్టబోతున్నారు. ఈ రెండు పార్టీల్లో ఏదొక దానిలో చేరడం, నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలనే తన ఆకాంక్షను అభిమానుల ఎదుటే వ్యక్తీకరించి ఆ తదుపరి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. జిల్లాలో ఆయనతో పాటు మరికొందరు కాంగ్రెస్‌కు దూరం అవుతారని అంచనా వేసినా దీనికి విరుద్దంగా కాంగ్రెస్‌లో మిగిలిన సీనియర్లందరూ వసంత్‌కు దూరంగానే మిగిలిపోయారు. వచ్చేనెలలో జరగబోతున్న భేటీకి హాజరు కావాల్సిందిగా వసంత్‌కు సన్నిహితులుగా ఉన్న వారందరికీ వర్తమానం అందింది.

అయితే జనసేనలో చేరడానికి ముందు నుంచి ఆసక్తి చూపిన వట్టి రూటు మార్చినట్లు తెలుస్తుంది. జనసేన కంటే వైసీపినే తనకు సేఫ్ ప్లేస్ అనుకున్న ఈ మాజీ మంత్రి అందుకు తగ్గట్లు ప్లాన్ సిద్దం చేసుకుంటున్నారు. వసంత్ సోదరుడితో వైసీపీ నడిపిన రాయబారం సక్సెస్ అవ్వడంతో పార్టీలో చేరికకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తుంది. వైఎస్ కి వీరవిధేయుడిగా ఉండే వసంత్ కుమార్ ఆ తర్వాత జగన్ పార్టీ పట్ల అంత ఆసక్తి చూపలేదు. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో వైసీపీతోనే తన సెకండ్ పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు.