Home News Politics

అరుస్తే కరుస్తాడు ! తాళ్లతో కట్టెయ్యండ్రా… ! పాల్ వర్సెస్ వర్మ అగైన్

అరుస్తే కరుస్తాడు ! తాళ్లతో కట్టెయ్యండ్రా... ! పాల్ వర్సెస్ వర్మ అగైన్

SHARE

ఎన్నికలు ముగిసిపోవడంతో పాల్ కామెడీ తగ్గిపోతుందని అంతా బాధపడుతున్నారు. ఈ ఎన్నికల్లో కె ఏ పాల్ కామెడీనే హైలెట్… సరదాగా అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో పాల్ పై సెటైర్స్ వేశారు. పాల్ పోలింగ్ కేంద్రం నుంచి పరిగెత్తుకు వచ్ఛే వీడియో షేర్ చేసి కిందవిధంగా కామెంట్ పెట్టారు.

అరుస్తే కరుస్తాడు ! తాళ్లతో కట్టెయ్యండ్రా… ! పాల్ వర్సెస్ వర్మ అగైన్


గొలుసులతో కట్టేయకపోతే కరుస్తాడేమో అని కామెంట్ చేశారు వర్మ. గతంలో కూడా పాల్ వర్మల మధ్య సోషల్ మీడియా వేదికగా సంవాదం జరిగింది. వర్మ తన కాళ్ళు పట్టుకుని ఆశీర్వాదం తీసుకున్నాడని పాల్ చెపితే దానికి వర్మ మరో విధంగా బదులిచ్చాడు. కాళ్లుపట్టుకుని లాగుదామనే ప్రయత్నించాను అప్పటికైనా బుర్ర సెట్ అవుతుందేమోనని.