Home News Politics

ఉత్తరాంద్రాలో మళ్ళీ మొదలైన బొత్స మార్క్ పాలిటిక్స్….

ఉత్తరాంద్రాలోనే తిరుగులేని నేతగా ఎదిగి రాష్ట్ర విభజనతో పదవితో పాటు పూర్తిగా కేడర్ ను కోల్పోయిన ఆనేత ఇప్పుడు ఏంచేయబోతున్నారు ? పోగోట్టుకున్న చోటే ..నిలదోక్కుకోవడానికి ఆ సీనియర్ నేత గీస్తున్న స్కెచ్ ఏంటి ? తనని నిలువునా ముంచిన జిల్లా స్థాయి నేతలకు ఆ నేత ఎలా చెక్ పెట్టబోతున్నారు . విజయనగరం జిల్లాలో మల్లి పాగా వేయడానికి ప్రయత్నిస్తున్న ఆ నేత ఏవరు ? ఆయన స్కెచ్ ఏంటి ?

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తరాంద్రాలో తిరుగులేని నేతగా ఎదిగి మంత్రిగా పని చేసి , ఒకానోక టైంలో సీఎం క్యాండెట్ రేసులో సైతం నిలిచిన వ్యక్తి బొత్సా సత్యనారాయణ … ఉత్తరాంద్రా రాజకీయాలలో మకుటం లేని మహారాజు గా ఏదిగిన ఆయనకు రాష్ట్ర విభజన అంశం ప్రజాక్షేత్రంలో కోలుకోలేని దెబ్బకోట్టింది , ఒంటి చేత్తో జిల్లాలలోని అన్ని సీట్లను గెలిపించుకునే సత్తా ఉన్న నేత గా పేరోందిన ఆయన 2014 ఎన్నికల్లో చతికిలపడ్డారు . దీంతో ఎల్లప్పుడు తనతోనే ఉంటారనుకునే జిల్లాస్థాయి నేతలు , బోత్సా ప్రధాన అనుచరులుంతా తమ రాజకీయ అవకాశాల కోసం ఒక్కోక్కరు బొత్సాను వీడి వెల్లపోయారు . ఏకాకిగా మిగిలిన బోత్సా చాలా కాలం పాటు జిల్లాకు దూరంగా ఉన్నారు కూడా . తిరిగి వైసిపిలో చేరాకా కోన్నాళ్ళ పాటు సైలెంట్ గా ఉన్న ఆయన ఎన్నికలు సమీపిస్తున్న వేల తన రాజకీ వ్యూహాలకు పదునుపెడుతున్నారు , తన దైన శైలిలో తెర వెనుక రాజకీయాలు నడుపుతూ జిల్లాలోని ద్వితియ స్థాయి కేడర్ కి దగ్గరవుతున్నారు బొత్సా.

గత కోన్ని రోజులగా జిల్లాలో తలో దారి లో వెల్తున్న వైసిపి శ్రేణుల ను ఏకతాటిపై కి తీసుకోస్తున్న బోత్సా ఒకనాడు తనను వదిలి వెల్లిన జిల్లా మండల స్థాయి నేతలతో పాటు ద్వితియ స్థాయి కేడర్ తిరిగి తన గూటికి వచ్చెలా వ్యూహరచన చేస్తున్నారు . బోత్సా అధికారంలో ఉన్న పదేల్లు జిల్లా మండల స్థాయి నేతలతోనే ఎక్కువగా సన్నిహితంగా ఉండేవారు దీంతో బొత్సా అభిమానులుగా ఉన్న ద్వితియశ్రేణి నేతలంతా తమ పనులుకోసం జిల్లా స్థాయి నేతలపై ఆదరపడాల్సిన పరిస్తితి తలెత్తేది బోత్సాకూడా జిల్లా స్థాయి నేతలకే అధిక ప్రాదాన్యం ఇచ్చేవారన్న విమర్శలు కూడా లేకపోలేదు దీంతో బోత్సాకు ద్వితియ శ్రేణి నేతలకు నేరుగా పెద్దగా సంబంధాలు లేకపోవడంతో రాష్ట్ర విభజనానంతరం చోటు చేసుకున్న పరిణామాలతో జిల్లా మండల స్థాయి నేతల వెంటే ద్వితియ స్థాయి కేడర్ కుడా నడిచి బోత్సాను వీడి వెల్లిపోయారు .దీంతో సూదీర్గ రాజకీయ జీవితంలో సంపాదించుకున్న కేడర్ ని అంతా కోల్పోయి చేదు అనుభవాన్ని చవి చూసిన బోత్స తన వ్యూహాలను మార్చుకుంటూ ముందుకుపోతున్నారు ..

మండల జిల్లా స్తాయి నేతల హవా తగ్గిస్తూ , వివిద పార్టీలలో క్రియాశీలకంగా వ్యక్తిగతంగా తనకు దూరమైన ద్వితియ శ్రేణి కేడర్ ను గుర్తించే పనిలో బోత్సా ఉన్నారని తెలుస్తోంది , ఆలాంటి వారికి వైసిపి లోకి తీసుకోచ్చి తగిన ప్రాదాన్యం ఇవ్వడం ద్వారా అటు పార్టిని బలో పేతం చేయడం తో పాటు తాను కోల్పోయిన కేడర్ ను తిరిగి సంపాదించుకోవచ్చేనేది బోత్సా ఆలోచనగా తెలుస్తోంది , ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ద్వితియ శ్రేణి నేతలంతా ఒక్కోక్కరిగా వైసిపి తీర్దం పుచ్చుకుంటున్నారు , పార్టిలోకి వచ్చే వారికి సముచిత ప్రాదాన్యం కల్పిస్తుండటంకో ద్వితియ శ్రేణి నాయకత్వం ద్వారా వైసీపీ క్షేత్రస్థాయిలో బలంగా దూసుకుపోతుంది ..

వైసిపి అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్ర విజయనగరం జిల్లాకు చేరడంతో పార్టిని పూర్తిస్తాయిలో బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు రూపోందిస్తున్నారు బోత్సా , దీనిలో బాగంగా జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో వలసలు ప్రోత్సహిస్తున్నారు , పార్టిలో ద్వితియ శ్రేణి నేతలకు ప్రాధాన్యం పెరగడంతో నాడు బొత్స ఇలా కాలో చక్రం తిప్పిన జిల్లా మండలస్థాయి నేతలు కూడా ఎలర్ట్ అవుతు పార్టి కార్యక్రమాల్లో చూరుకుగా పాల్గోంటూ ఇటు పార్టి పెద్దల వద్ద బొత్సా వద్దా నమ్మకాన్ని పెంచుకోవడానికి ప్రయత్నస్తున్నారని వైసిపి వర్గాల్లో చర్చగా మారింది మరో వైపు గతంలో బొత్సాని విడిన జిల్లా స్థాయి నేతలుకూడా ఇప్పుడు వైసిపి వైపు చూస్తున్నారనే టాక్ కూడా ఉంది.

మోత్తానికి బొత్సా కోత్తా స్కెచ్ తో చాప క్రింద నీరులో జిల్లాలో వైసిపి బలపడుతుండటంతో వచ్చే ఎన్నికల్లో వైసిపి ప్రజాక్షేత్రంలో మంచి పలితాలను సాదించడమే కాకుండా , బోత్సా మార్క్ రాజకీయాలకు జిల్లాలో మల్లి తెరలెచినట్టవుతుందని బావిస్తున్నారు పొలిటికల్ ఎక్స్ పర్ట్స్.