Home News Politics

ఉత్తమ్ స్కెచ్ ఇదేనా…?

SHARE

లోక్‌సభ ఎన్నికల అభ్యర్ధులను కాంగ్రెస్‌ ఆచితూచి ఎంపిక చేసినట్లు కనిపిస్తుంది.. తెలంగాణలోని అన్ని సీట్లపై ఆశలు పెట్టుకోకుండా.. విజయావకాశాలు ఉన్న సీట్లపైనే ప్రధానంగా దృష్టి సారించింది.. హైకమాండ్‌ చేయించుకున్న సర్వేలకు అనుగుణంగా అయిదారు చోట్ల బలమైన అభ్యర్ధులను రంగంలోకి దించింది.. ఆ లిస్ట్‌లో పిసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కూడా ఉన్నారు .. ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలన్న పట్టుదలతో ఉన్నారంట ఉత్తమ్‌.. అసలింతకీ ఉత్తమ్ వేసుకున్న లెక్కలేంటి?

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ప్రత్యేక దృష్టి సారించింది.. అన్ని నియోజకవర్గాల అభ్యర్ధుల ఎంపిక విషయంలో కాకపోయినా.. కొన్ని సెగ్మెంట్ల విషయంలో మాత్రం సీరియస్‌గా వర్క్‌ చేసినట్లు కనిపిస్తోంది.. ఏఐసీసీ చేసిన సర్వే నివేదిక ప్రకారం..అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు కనిపిస్తోంది … ఆ క్రమంలోనే సీనియర్‌ నేతలు కూడా బరిలోకి దిగారంటున్నారు..

మొత్తం..16 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి … అయిదారు నియోజక వర్గాల్లో మాత్రం కాంగ్రెస్ గట్టి క్యాండిట్లనే పెట్టింది… కాంగ్రెస్ ఆశలు పెంచుకుంది కూడా వాటి మీదే.. భువనగిరి ఎంపిగా ఖచ్చితంగా గెలుస్తానంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అవకాశమిచ్చింది కాంగ్రెస్‌.. మల్కజ్‌గిరి ఎంపి అభ్యర్ధిగా రేవంత్‌రెడ్డిని పోటీకి దింపి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేసింది.. చేవెళ్లలో టిఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన ఎంపీ విశ్వేశ్వరరెడ్డి మళ్ళీ బరిలో నిలిచారు… ఖమ్మంలో రేణుకాచౌదరి , ఆదిలాబాద్‌లో రమేష్‌రాథోడ్‌లు సామాజికవర్గ లెక్కలతో విజయం సాధిస్తారని ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్‌.

వీరందరు ఒక ఎత్తైతే నల్లగొండ ఎంపిగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలో దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది.. ప్రస్తుతం హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఎంపీగా గెలిచితీరాలన్న పట్టుదలతో ఉన్నారు.. ఎంపీగా గెలిస్తే రాష్ట్ర రాజకీయాల నుంచి దేశరాజకీయల్లోకి ఉత్తమ్ షిఫ్ట్‌ అవుతారు.. హైకమాండ్‌ పెద్దల వద్ద ఉన్న పలుకుబడితో ఆయన అక్కడ కీలకంగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు ..

ఉత్తమ్‌ భార్య కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి ముందస్తు ఎన్నికల్లో అదే స్థానం నుంచి పరాజయం పాలయ్యారు .. గత అసెంబ్లీలో భార్యభర్తలు ఇద్దరు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు .. ప్రస్తుతం ఉత్తమ్ ఎంపీగా గెలిస్తే హుజుర్‌నగర్ సీటు నుంచి తన భార్య పద్మావతిని నిలబెట్టే ఆలోచనలో ఉన్నారంట .. ఆయన అనుకున్నట్లు అన్నీ కలిసి వస్తే మళ్లీ భార్యభర్తలు ఇద్దరు ఒకరు ఎంపిగా, ఒకరు ఎమ్మెల్యేగా చట్టసభల్లో అడుగుపెడతారన్నమాట.. ఇక వేళ ప్లాన్‌ రివర్స్‌ అయితే ఆయనకు ఎమ్మెల్యే పదవి ఎలాగూ ఉంటుంది కదా.