Home News Updates

ఆర్టీసీ సమ్మె పై కేసు నవంబర్ 7వ తేదీకి వాయిదా

SHARE

ఆర్టీసీ సమ్మె పై కేసును నవంబర్ 7వ తేదీకి వాయిదా వేసిన కోర్టు
ఆర్ధిక స్థితిగతులపై అఫిడవిట్ దాఖలు చేసిన ఆర్టీసీ యాజమాన్యం.. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నుంచి రాయితీల సొమ్ము రూ.644.51 కోట్లు రావాల్సి ఉండగా, మొత్తం సొమ్మును ప్రభుత్వం విడుదల చేసాము . హైదరాబాద్‌లో బస్సులు నడుపుతున్నందుకు రూ.1786.06 కోట్లు చెల్లించాలని జీహెచ్‌ఎంసీకి ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. 2015-16, 2016-17లో కలిపి రెండేళ్లలో జీహెచ్‌ఎంసీ 336.40 కోట్లు విడుదల చేసింది.

మిగతా సొమ్ము చెల్లించే స్థోమత లేదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. జీహెచ్‌ఎంసీ చట్ట నిబంధనల ప్రకారం సెక్షన్‌ 112(30) ప్రకారం నగరంలో బస్సులు నడిపినందుకు వచ్చే నష్టాలను భర్తీ చేయడానికి జీహెచ్‌ఎంసీ అంగీకరించలేదు

అందువల్ల జీహెచ్‌ఎంసీ నుంచి రావాల్సినవి బకాయిలుగా పరిగణించరాదు. ఆర్టీసీలో నిర్వహణ, డీజిల్‌ భారం ఎక్కువగా ఉంటోంది. నిర్వహణ వ్యయం వల్లే నష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వ సాయం అందుతున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది.

సమ్మె ప్రారంభమైన అక్టోబరు 5 నుంచి 30వ తేదీ వరకు బస్సుల ద్వారా సంస్థ రూ.78 కోట్లు ఆర్జించగా, ఇదే కాలానికి రూ.160 కోట్లు వ్యయమైంది. రూ.82 కోట్ల నష్టం వాటిల్లింది.

ఆర్టీసీ ఆర్ధిక స్థితి ఫై ఆర్టీసీ యాజమాన్యం రిపోర్ట్. .
ఆర్టీసీ సమ్మె పిటిషన్ పై. హైకోర్టు లో విచారణ ప్రారంభం

కోర్ట్ ఆదేశాల మేరకు హైకోర్టు హాజరైన ఆర్టీసీ ఇంచార్జ్ ఎండి సునీల్ శర్మ..
ఆర్టీసీ తరపున కోర్టుకు హాజరైన సునీల్ శర్మ ఎండి, టీవీ రావు ఈడీ, రమేష్ ఫైనాన్స్ అడ్వైసర్.
ఆర్టీసీ యజమాన్యం సబ్మిట్ చేసిన రిపోర్ట్ ఫై హై కోర్ట్ ఆగ్రహం .
ఆర్టీసీ అధికారులు తప్పుడు సమాచారం కోర్ట్ కు ఇస్తున్నారని హై కోర్ట్ అసహనం.
హై కోర్ట్ కు స్వయం గా ఆర్టీసీ వివరాలు ఇస్తున్న ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ.
బస్సుల కొనుగోలు కోసం కేటాయించిన రుణాన్ని రాయితీల బకాయిల చెల్లింపు గా నివేదికలో ఎలా పేర్కొంటారన్న హైకోర్టు. .

రాయితీల బకాయిలు డీజిల్, జీతాల చెల్లింపు ఇతర అవసరాల కోసం వాడామన్న ఆర్టీసీ యజమాన్యం. జిహెచ్ఎంసీ ఆర్టీసీకి డబ్బులు చెల్లించాలా లేదా తేల్చాలన్న హై కోర్ట్ 2017 లో జిహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి బాగోకపోవచ్చు.. ఇప్పుడు బాగానే ఉందన్న హై కోర్టు
.
2016 -17 సంత్సరానికి ghmc నుండి ఆర్టీసీ కి 246 కోట్లు చెల్లించాల్సి ఉంది …కానీ అప్పుడు ghmc దగ్గర నిధులు లేవని ప్రభుత్వానికి తెలిపింది…

ఇప్పుడు కూడా ghmc దగర నిధులు లేవా.?? హై కోర్ట్.
ఆర్టీసీ ఎండీ సమర్పించిన నివేదిక అంతా తప్పుడు లెక్కలతో ఉందన్న ప్రకాష్ రెడ్డి
.
కోర్ట్ లకు నివేదిక సమర్పించే సమయంలో పూర్తి వివరాలు కాకుండా సగం సగం వివరాలు పొందపర్చడం పై సునీల్ శర్మ పై హై కోర్ట్ సీరియస్.
2018 -19 సంవత్సరానికి ghmc నుండి ఆర్టీసీ కి రావాల్సిన నిధులు గురించి ghmc కి తెలియజేశారా??

ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ను ప్రశ్నించిన హై కోర్ట్