Home News

కారు-కమలం స్నేహం ఇంకా కొనసాగుతుందా…!

SHARE

కేంద్రంతో సంబంధాలపై టిఆర్‌ఎస్‌ క్లారిటీతోనే ఉందా? వ్యతిరేకిస్తున్నామంటూనే పార్లమెంట్ లో బిల్లుల అమోదానికి వ్యూహాత్మకంగా సహకరిస్తోందా? కీలక ఆర్టీఐ చట్ట సవరణ బిల్లుకు స్నేహ హస్తం అందించిన టిఆర్ఎస్… త్రిపుల్ తలాక్ బిల్లు చర్చకు దూరంగా ఉండి ఇన్ డైరెక్ట్‌గా సహకరించిందా? మరోవైపు రాష్ట్రంలో బిజెపిపై టిఆర్ఎస్ నేతల విమర్శల వెనుక మతలపు ఏంటి?

కీలకమైన బిల్లుల అమోదం విషయంలో కేంద్రం పట్ల ప్రాంతీయ పార్టీలు అనుసరిస్తున్న వైఖరి ఇప్పుడు చర్చనీయశంగా మారింది … అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ , బిజెపిల మధ్య మాటలతూటాలు పేలాయి … ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు … దాంతో టిఆర్ఎస్‌కు ఆ పార్టీకి మధ్య గ్యాప్ వచ్చిందన్న చర్చ మొదలైంది… అయితే కేంద్రంతో రాష్ట్రానికి రాజ్యంగబద్దంగా ఉండే సంబంధాలు కొనసాగిస్తామని టిఆర్ఎస్ ప్రకటిస్తూ వస్తోంది… ఆ క్రమలో పార్లమెంట్ సమావేశాలో బిల్లుల ఆమోదం విషయంలో టిఆర్ఎస్ వైఖరి ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది.

రాజ్యసభలో ఆర్టీఐ చట్ట సవరణ బిల్లుకు టిఆర్ఎస్ మద్దతు ఇచ్చింది … అమిత్ షా స్వయంగా కోరడంతో టిఆర్ఎస్ సానుకూలంగా స్పందించింది … ఇక కీలకమైన త్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో లోకసభలో ఓటింగ్ దూరంగా ఉంది టిఆర్ఎస్ … అటు రాజ్యసభలో చర్చలో కూడా పాల్గొనకుండా సమావేశానికి దూరంగా ఉంది … టిఆర్‌ఎస్‌ తాను తీసుకున్న స్టాండ్‌తో రాజ్యసభలో త్రిపుల్ తలాక్ బిల్లు అమోదానికి ఇన్ డైరెక్ట్ గా సహకరించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది..

అదే సమయంలో రాష్ట్రానికి వచ్చేసరికి .. టిఆర్ఎస్ నేతలు కేంద్రంపై సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్నారు … కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ విద్యా విధానం ముసాయిదాలోని అంశాలపై మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు.. కేంద్రానికి రహస్య ఎజెండా ఉందని … ముసాయిదాలో స్పష్టత లేదని … కుట్రకోణం కనిపిస్తోందని తీవ్రమైన ఆరోపణలు చేశారు..

మొత్తంగా చూస్తే పైకి మాత్రం టిఆర్ఎస్ తమకు బిజేపితో ఎటువంటి స్నేహ సంబంధాలు లేవంటోంది.. కేంద్రంతో రాజ్యపరంగా ఉండాల్సిన సంబంధాలను రాష్ట్ర ప్రభుత్వం కోనసాగిస్తుందని తేల్చిచెబుతోంది… ఏదేమైనా త్రిపుల్‌ తలాక్‌ బిల్లు ఆమోదం సమయంలో టిఆర్‌ఎస్‌ ఎంపిలు తీసుకున్న స్టాండ్‌పై పెద్ద చర్చే జరుగుతోందిప్పుడు..