Home News

టీఆర్ఎస్ మీడియా చర్చల పై ప్యూహం ఇదేనా…!

SHARE

పార్టీ చెప్పకుండా మీడియా చర్చల్లో టిఆర్‌ఎస్‌ నేతలు పాల్గొనకూడదన్న .. గులాబీ బాస్ కేసిఆర్ నిర్ణయం వెనుక ఏమైన వ్యూహం ఉందా ? ఇప్పటి వరకు పార్టీ తరపున చర్చల్లో పాల్గొంటున్న వారు సమర్ధవంతంగా వాదనలు వినిపించలేకపోయారా? ఆ భావనతోనే కేసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారా ? .. అసలు మీడియా చర్చలకు వెళ్లే వారి జాబితాలో .. ఎవరెవరి పేర్లు ఉండబోతున్నాయి? ప్రస్తుతం పార్టీవర్గాల్లో ఇదే చర్చ..


టిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించిన నిర్ణయం … ఆ పార్టీ నాయకుల్లో చర్చనీయశంగా మారింది … సమావేశం జరిగిన రోజు నుంచి మీడియా చర్చా కార్యక్రమాల్లోకి పార్టీ వైపు నుంచి ఎవరూ వెళ్లవద్దని స్పష్టం చేసారు గులాబి బాస్ … ఒక వేళ ఏవరైన గీత దాటితే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు … అయితే గతంలో జరిగిన సమావేశల్లో కూడా కేసిఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించారని కొందరు టిఆర్ఎస్ నేతలు అంటున్నారు .


మీడియా చర్చల్లో పాల్గొంటున్న నేతలు ఒకే అంశంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని సమావేశంలో కేసిఆర్ అన్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి… ఆ క్రమంలో చర్చలకు ఎవరు వెళ్లాలో పార్టీనే నిర్ణయిస్తుందని కేసిఆర్ స్పష్టం చేశారు… దాంతో నేతలు అంతా ఆ జాబితా ఎప్పుడు వెలువరుస్తారా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .


టివి చర్చల్లో పాల్గొని… పార్టీ వాదనలు బలంగా వినిపించి … పెద్దల దృష్టిలో పడాలని పొలిటికల్ జర్ని మొదలుపెట్టిన వారిలో ఉంటుంది … అందులో భాగంగానే అవకాశం దొరికితే ఆయా చర్చల్లో పాల్గొని విపక్షాలపై విమర్శలు గుప్పించడం … పార్టీ నిర్ణయాలను సమర్ధించడంపై ఆ నేతలు దృష్టిపెడతారు … అలా చర్చల్లో పాల్గొని పార్టీ ముఖ్యుల దృష్టిలో పడినవారు కూడా లేకపోలేదు…


ఇప్పడు మీడియా చర్చల్లో పాల్గొనవద్దని పార్టీ అధినేతే ప్రకటించడంతో … నేతలు పార్టీ ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నారు … కేసీఆర్‌ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ నేతృత్వంలోని కమిటి … చర్చల్లో పాల్గొనే వారి జాబితాను ఖరారు చేసే పనిలో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి… త్వరలో ఎంపిక చేసిన నేతలతో సదరు జాబితాను టిఆర్ఎస్ విడుదల చేసే అవకాశం ఉంది


ఇప్పటి వరకు తమకున్న పిఆర్‌తో టివి స్టూడియోల్లో చర్చలకు వెళుతున్న నేతలు … ఇప్పుడు తమ పేరు జాబితాలో ఉంటుందా? ఉండదా? అన్న టెన్షన్లో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది… ఇప్పటి వరకు పాల్గొన్న చర్చల్లో పార్టీ వాదనలు బానే వినిపించామా? అని కొందరు నేతలు సమీక్ష చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి… అదలా చర్చల్లో పాల్గొనవద్దన్న కేసిఆర్ నిర్ణయం వెనుక ఉన్న అసలు లాజిక్ ఏమై ఉంటుందో అన్న చర్చ ఇప్పటికి పార్టీ వర్గాల్లో జరుగుతోంది…