Home Women Health

విటమిన్ డి తో మూత్రపిండాల వ్యాధికి చికిత్స: మెరుగైన ఫలితాలు

SHARE

విటమిన్ డి తో మూత్రపిండాల వ్యాధికి చికిత్స:మెరుగైన ఫలితాలు దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి తొలిదశలో ఉన్న వారికి విటమిన్‌-డి ఇస్తే మంచి ఫలితం ఉంటుందని ఒక పరిశోధన తెలిపింది. ముఖ్యంగా.. రక్తనాళాలకు సంబంధించిన పనితీరు మెరుగుపడుతుందని, మంట, నొప్పి వంటివి గణనీయంగా తగ్గుతాయని పేర్కొంది.

దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి తొలిదశలో ఉన్న వారికి విటమిన్‌-డి ఇస్తే మంచి ఫలితం ఉంటుందని ఒక పరిశోధన తెలిపింది. ముఖ్యంగా.. రక్తనాళాలకు సంబంధించిన పనితీరు మెరుగుపడుతుందని, మంట, నొప్పి వంటివి గణనీయంగా తగ్గుతాయని పేర్కొంది. దిల్లీలోని జార్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌హెల్త్‌, చండీగఢ్‌లోని వైద్యవిద్య పరిశోధన పీజీ సంస్థ సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి.

విటమిన్ డి తో మూత్రపిండాల వ్యాధికి చికిత్స: మెరుగైన ఫలితాలు

దీనికి నేతృత్వం వహించిన వివేకానంద ఝా ప్రస్తుతం అమెరికాలోని శాండియాగోలో జరుగుతున్న ‘అమెరికా మూత్రపిండశాస్త్ర సదస్సు’లో వివరాల్ని వెల్లడించారు. విటమిన్‌ డీ తీసుకున్న రోగుల్లో 70 శాతం మందిలో రక్తనాళాల పనితీరు, రోగనిరోధక వ్యవస్థ పనితీరు అంతకుముందుకన్నామెరుగుపడిందన్నారు.

మూత్రపిండాల జబ్బుతో బాధపడే వారందరిలోనూ డీ విటమిన్‌ కొరత అనేది ఒక లక్షణం. చికిత్సను అందించటంద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపర్చవచ్చని ఈ పరిశోధన తొలిసారిగా తెలియజేసింది.