Home News Politics

కేసీఆర్ పాలనలో దళితులకు న్యాయం జరగదు: విజయశాంతి

SHARE

మందకృష్ణ కు సంఘీభావం తెలిపేందుకు ఇక్కడికి వచ్చాను….అంబేద్కర్ విగ్రహాన్ని డంపింగ్ యార్డులో పడేస్తారు… దళితులు అంటే కేసీఆర్ కు చిన్న చూపు .. ఆయన పాలనలో ఉన్నంత వరకు దళితులకు న్యాయం జరగదు….నిరసన, ఉద్యమాలు చేయటం తప్పా..మందకృష్ణ ను ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు…

కేసీఆర్ పాలనలో దళితులకు న్యాయం జరగదు: విజయశాంతి

ఇది మంచి పద్ధతి కాదు..అందరు కలిసి సాదించుకున్నది ఈ తెలంగాణ రాష్ట్రం హౌస్ అరెస్ట్ చేసి మందకృష్ణ ను అవమానించినందుకు దళితులకు క్షమాపణ చెప్పాలి….విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేసి తప్పును దిద్దుకోండి….లేకుంటే ఉద్యమాలు తప్పవు… మందకృష్ణ కు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది….

మందకృష్ణ…

నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న సమయంలో అక్క విజయశాంతి రాక ద్యేర్యం ను ఇచ్చింది..తెలంగాణ ఉద్యమంలో, అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కలిసి పని చేసాం…అంబేడ్కర్ ద్వేషి కేసీఆర్…అంబేద్కర్ ను గౌరవించే సంస్కృతి, నిజాయితీ ఆయనకు లేవు…రాజ్యాంగ నిర్మాత కు జరిగిన అవమానం కు విచారం వ్యక్తం చేయలేదు…ప్రపంచం అంతా అంబేడ్కర్ ను కీర్తిస్తుంటే, ఆయన జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న దాఖలాలు కేసీఆర్ కు లేవు…

మా సర్వస్వం అంబేద్కర్. ఆయన మా దేవుడు… అలాంటి ఆయన విగ్రహాన్ని చెత్త కుప్పలో పడేయడం మేం జీర్ణించుకోలేము.. కనీసం ఈ చర్యపై ఆయన విచారం వ్యక్తం చేయలేదు….సమైక్య రాష్ట్రంలోనూ ఇంతటి నిర్బంధం ఎదుర్కొనలేదు….