Home Entertainment Cinema

త్రిష అభిమానిని తెగ తిట్టేసింది..!

SHARE

అభిమానం మితి మీరితే కష్టమే. తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి అభిమానం చూపించి ఓ వీరాభిమాని ఏకంగా త్రిష చేత చీవాట్లు తిన్నాడు. త్రిష‌ పై ప్రేమాభిమానాలు పొంగిపోయి.. త్రిష మెప్పు పొంద‌డం కోసం ఓ ఫ్యాన్‌ మ‌రో న‌టిని దూషించాడు. అదీ త్రిష‌కు చెప్పి మ‌రీ తిట్టాడు. దీంతో ఆ అభిమాని పై త్రిష నిప్పులు చెరిగింది. అభిమానాన్ని హద్దుల్లో ఉంచుకోవాలని లిమిట్స్ క్రాస్ చేయోద్దంటూ ఫైర్ అయింది. కాదని వెళ్ళావా నా టైమ్ నుంచి నిన్ను బ్లాక్ చేస్తా.! అంటూ వార్నింగ్ ఇచ్చింది. నువ్వు నా సినిమాలు చూడ‌క‌పోయినా ప‌ర్వాలేదు. అంతేగాని ఇలాంటి చిల్లర వేషాలు వద్దంటూ చెడామడా తిట్టేసరికి ఆ అభిమాని బిత్తరపోయాడు.

కోలీవుడ్ లో చేతినిండా అవ‌కాశాలుండటంతో బిజీగా ఉన్న త్రిషకి ఇప్పటికే నాలుగు సినిమాలు సెట్స్ లో ఉండ‌గా, మూడు సినిమాలు పోస్ట్ ప్రొడ‌క్షన్ లో ఉన్నాయి. తెలుగు, త‌మిళ్ లో కూడా ఒక్కో సినిమా కమిటై ఉన్న త్రిష తాను నటించిన `96` సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. ఇది త్రిష, విజయ్ సేతుపతి కాంభినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వహిస్తున్నారు. మ‌రోవైపు సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ స‌ర‌స‌న కార్తీక్ సుబ్బరాజు చిత్రంలో కూడా త్రిష న‌టిస్తోంది.