Home News

కౌన్ బనేగా మండలి చైర్మన్…!

SHARE

తెలంగాణ శాసనమండలి కొత్త ఛైర్మన్‌గా ఎవరికి ఛాన్స్‌ దక్కుతుంది? తెలంగాణ శాసన మండలి చైర్మన్ పదవికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది . స్వామి గౌడ్ పదవీ విరమణ చేసాక చైర్మన్‌గా ఎవర్నీ నియమించలేదు … డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న నేతి విద్యాసాగర్‌ ఛైర్మన్‌ అవుతారని భావించినా.. ఆయనకు ప్రమోషన్ ఇవ్వడం సీఎంకు ఇష్టం లేదని తెలుస్తుంది.. ఆక్రమంలో కొత్త ఛైర్మన్‌ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది

మండలి చైర్మన్ గా ఉన్న స్వామి గౌడ్ ఎమ్మెల్సీగా పదవీ విరమణ చేసాక ఆయన నిర్వహించిన ఛైర్మన్‌ పదవి ఖాళీ ఆయింది … మరోసారి అవకాశం ఇస్తారని ఎదురుచూసిన స్వామిగౌడ్‌కి నిరాశే ఎదురైంది … అప్పటికే ఎంపీ , ఎమ్మెల్యే ఎన్నికలు కూడా పూర్తి అవడంతో పోటీ చేసి గెలవాలన్న స్వామి గౌడ్ కోరిక కూడా నెరవేరలేదు … ఏ పదవీ లేక పోవడంతో ఆయన ఇంటిదారి పట్టాల్సి వచ్చింది.. ఉద్యమంలో కలిసి పని చేసిన తనకు కేసీఆర్‌ మరోసారి రాజకీయ పదవి ఇస్తారని ఇంకా ఆశతోనే ఉన్నారు ఈ మాజీ శాసనమండలి మాజీ ఛైర్మన్..

ఇక చాన్స్ ఉన్న మరోనేత మండలిలో చీఫ్‌విప్ గా ఉన్న ఉపాధ్యయ నేత పాతూరి సుధాకర్ రెడ్డి. ఆయన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు … పాతూరిపై మంచి అభిప్రాయం ఉండటంతో ..ఒకవేళ ఆయన గెలిచి ఉంటే ఆయనకు ఛైర్మన్‌ ఛాన్స్ దక్కేదంటున్నారు.. ఇక ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ గా ఉన్న నేతి విద్యాసాగర్‌ను చైర్మన్‌ చేయడం గులాబీబాస్‌కు ఇష్టం లేదంట..

నయీమ్ కేసులో విద్యాసాగర్‌ ఆరోపణలు ఎదుర్కోవడం , ఏకంగా పదవిలో ఉన్న నేతిని సిఐడి విచారించడం సంచలనంగా మారింది … ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న నేతికి పెద్దల సభ బాధ్యతలు ఇచ్చే పరిస్థితి కనపడటం లేదు … మండలిలో ఉన్న వాళ్లల్లో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సీనియర్‌గా ఉన్నారు … రెండోసారి క్యాబినెట్ లోకి కడియంను తీసుకోలేదు … జిల్లాలో నేతలతో గొడవలు ఆయనకు మైనస్‌ అంటున్నారు… సామజిక వర్గం కలిసి వస్తుంది అనుకున్నా పార్టీ ముఖ్య నాయకులతో సఖ్యత లేకపోవడంతో కడియం నో ఛాన్స్‌ అంటున్నారు ..

ఇక నాయినీ నర్సింహా రెడ్డి ఎమ్మెల్సీ గా ఉన్నారు… వయసు మీద పడటం , మాట తూలే అలవాటు ఉండటంతో ఆయన్ని ఈ సారి క్యాబినెట్‌లోకి తీసుకోలేదు.. ఛైర్మన్‌ పదవి ఇద్దామన్నా అవే అడ్డంకులుగా మారుతున్నాయంట .. దీంతో పార్టీకి లాయల్ గా ఉన్న, ప్రస్తుతం ఆక్టివ్ గా ఉన్న ఎమ్మెల్సీ కోసం వేట మొదలుపెట్టింది గులాబీ పార్టీ… బడ్జెట్ సమావేశాల్లోగా కొత్త చైర్మన్ ను ఎన్నుకోవాలని నిర్ణయించింది.. మరి ఆ ఛాన్స్‌ ఎవరికి దక్కుతుందో చూడాలి…