Home News Politics

తెలంగాణ అసెంబ్లీ రద్దు ముహూర్తం ఇదేనా ?

SHARE

తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దు ముహూర్తానికి డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. జాతకలను విశ్వసించే కేసీఆర్ రేపు (గురువారం) అత్యంత అనుకూలమని భావిస్తున్నారు. గ్రహస్థితులు అనుకూలంగా ఉండటంతో ఈ సమయంలోనే కీలక నిర్ణయం వెల్లడించే దిశగా ప్లాన్ సిద్దం చేసుకున్నారు సీఎం కేసీఆర్.

సెప్టెంబర్ 6న మధ్యాహ్నంలోగా తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో అసెంబ్లీ రద్దుపై కేబినెట్ తీర్మానం చేయనుంది. ఆ తర్వాత సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీని రద్దు చేయనున్నట్లు తెలుస్తుంది.

అసెంబ్లీ రద్దు చేస్తే తలెత్తే పరిణామాలపై సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో ఉన్నతాదికారులతో ఎడతెగని మంతనాలు జరిపారు. అనంతరం అధికారులు రాజ్ భవన్ లో గవర్నర్ కార్యదర్శితో చర్చించారు. ఈ నెల 7 నుంచి సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలకు సిద్దం కావడంతో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది.