Home News

కరకట్ట కూల్చివేతల పై టీడీపీ ప్యూహం ఇదేనా…!

SHARE

కృష్ణా కరకట్ట అక్రమనిర్మాణాల వ్యవహారం ఇప్పుడు అసెంబ్లీలోనూ హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అధికార వైసీపీ,విపక్ష టీడీపీ సభలో తీవ్ర విమర్షలు చేసుకున్నరు. అయితే టీడీపీకి వచ్చిన సమస్యల్లా చంద్రబాబు ఇంటిని ఖాళీ చేయడం అలా ఖాళీ చేస్తే తాము తప్పు చేశామని ఒప్పుకున్నట్లే…ఇక అందుకే ప్లాన్ మార్చింది టీడీపీ…కాంగ్రెస్ హయాంలో కృష్ణా, గోదావరి నదులపై ఉన్న అక్రమ నిర్మాణాలను తెరపైకి తీసుకొస్తుంది ప్రతిపక్షపార్టీ..ఈ అక్రమ నిర్మాణాలను పక్కనబెట్టి వైసిపి సర్కార్ కక్ష సాధింపు కోసమే చంద్రబాబు నివాసాన్ని కూల్చేయడానికి సిద్దమైందన్న విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ప్యూహాన్ని సిద్దం చేస్తుంది….

రాష్ట్రంలో దాదాపు 70 వేల కి పైగా అక్రమ నిర్మాణాలుంటే కేవలం చంద్రబాబు నివాసం,బాబు సీఎంగా ఉన్నప్పుడు క్యాంప్ ఆఫీస్ గా ఉన్న ప్రజావేదికను రాత్రికి రాత్రి కూల్చి నేలమట్టం చేయడం ఇవన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్లాన్ సిద్దం చేస్తుంది. ఒకపక్క న్యాయస్థానంలో పోరాడటం మరో పక్క ప్రజల మద్దతుతో ప్రభుత్వంపై వత్తిడి తేవడం ద్వారా వైసిపి దూకుడుకు చెక్ పెట్టాలని ఇప్పటికే టిడిపి శ్రేణులకు ఆదేశాలు వెళ్లాయి.

ఏపీలోని నదీపరివాహక ప్రాంతాల్లో 70 వేలకు పైగా అక్రమ కట్టడాలు ఉన్నాయని ఇందులో ప్ర్తభుత్వ భవనలు,పెద్దల భవనాఅలు,పేదల భవనాలు అన్ని ఉన్నాయని లెక్కల చిట్టా విప్పుతుంది టీడీపీ. ఏకంగా సీఎం జగన్ బంధువులే నెల్లూరులో అక్రమ నిర్మాణాలు చేపట్టారని దీనిపై అసెంబ్లీలో నిలదీశారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. చంద్రబాబు నివాసానికంటే ముందు వీటి పై దృష్టిపెట్టాలని వీరందరు దశాబ్దాలుగా కరకట్టలపైనే నివాసం వుంటున్నారని అనే అంశం లేవనెత్తుతుంది. తమ జోలికి వస్తే ఈ వర్గాలను ముందు పెట్టి పోరాడతామన్న సంకేతాలను టిడిపి పంపింది. ఈ నేపథ్యంలో వైసిపి సర్కార్ దీనికి ప్రతివ్యూహం ఏవిధంగా రూపొందిస్తుందో చూడాలి.