Home News Politics

టీడీపీ నంద్యాల పార్లమెంట్ అభర్దిగా మాజీ పోలీస్ బాస్

SHARE

కీలక పదవుల్లో విధులు నిర్వర్తించిన అధికారులు పాలిటిక్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు.. రిటైర్ మెంట్ తర్వాత ఎవరి లెక్కలతో వారు తమకు నచ్చిన పార్టీల్లో టికెట్లు ఓకే చేసుకుంటున్నారు.. ఆ క్రమంలో 2019 ఎన్నికల్లో పోటీకి కర్నూలు జిల్లాలో ఐఎఎస్, పోలీస్ సర్వీస్, వైద్యులు, అడ్వొకేట్లు ఆసక్తి చూపుతున్నారు.. కొందరు ఇప్పటికే ఆయా పార్టీలతో తమ సీటు ఖరారు చేసుకున్నారు…

నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఓ మాజీ పోలీసు అధికారి టిడిపి నుంచి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. పార్టీ అధిష్టానం కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కర్నూలు జిల్లాలో కర్నూలు, నంద్యాల రెండు పార్లమెంటు నియోజకవర్గాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉంటాయి … కర్నూలు ఎంపి సెగ్మెంట్లో బీసీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది… నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గం ప్రభావం కనిపిస్తుంటుంది… నంద్యాల పార్లమెంటుకు 3 ఉప ఎన్నికలతో కలిపి 22 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 12సార్లు రెడ్డి సామాజికవర్గం నుంచే ఎంపిగా ఎన్నికయ్యారు… దీంతో నంద్యాల పార్లమెంటు స్థానానికి ఏ పార్టీ అయినా రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థినే ఎంపిక చేసేందుకు ప్రాధాన్యత ఇస్తుంటాయి..

2019 ఎన్నికల్లో నంద్యాల పార్లమెంటు స్థానానికి టిడిపి అభ్యర్థిగా మాజీ పోలీస్ అధికారి మాండ్ర శివానందరెడ్డి పేరు దాదాపు ఖరారైందట… ఇప్పటికే నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్ చార్జిగా ఉన్న శివానందరెడ్డి ఎస్పీ హోదాలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు… శివానందరెడ్డికి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది… తండ్రి మాండ్ర గిడ్డారెడ్డి నందికొట్కూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు…. పాణ్యం వైసిపి ఎమ్మెల్యే గౌరు చరిత భర్త గౌరు వెంకటరెడ్డికి శివానందరెడ్డి స్వయానా బావ…

2014 ఎన్నికలకు ముందే శివానంద రెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేసి వైసిపిలో చేరారు…. 2014 ఎన్నికల తరువాత టిడిపిలో చేరారు… కర్నూలు జెడ్పీ స్థానం, నందికొట్కూరు మున్సిపాలిటీ టిడిపి దక్కించుకోవడానికి సహకరించారు… వైసిపిలో ఉన్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితను టిడిపిలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు శివానందరెడ్డి.
నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో రెడ్డి సామాజికివర్గం బలంగా ఉండడం, ఆర్థికంగా కూడా బలంగా ఉండడంతో టిడిపి అభ్యర్థిగా శివానందరెడ్డిని టిడిపి అభ్యర్థిగా దాదాపు ఖరారు చేశారంట… ప్రస్తుతం సిట్టింగ్ ఎంపిగా ఉన్న ఎస్పీవై రెడ్డి వైసిసి తరపున గెలుపొంది, ఫలితాలు వెలువడిన వెంటనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.. ఆయన వయోభారం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుండటంలో … ఆ సీటు ఎక్స్ పోలీస్ బాస్ శివానందరెడ్డికి ఖాయం చేశారంటున్నారు…