Home News Stories

టీడీపీ మేనిఫెస్టో…!

SHARE

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికల మ్యానిఫేస్టోను విడుదల చేశారు. పేదరిక నిర్మూలనే ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళతామన్నారు. గత ఎన్నికల్లో మ్యానిఫేస్టో చెప్పిన దానికంటే ఎక్కువ అమలు చేశామన్నారు. పేదరికంలేని, ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన సమాజాన్ని నిర్మించడమే తమ ధ్యేయమన్నారు. వైఎస్ఆర్ హయాంలో వ్యవసాయం భ్రష్టుపట్టిందన్నారు. మీ భవిష్యత్తు… నా భరోసా పేరుతో టీడీపీ మ్యానిఫేస్టోను విడుదల చేశారు. కేసీఆర్ చెప్పినట్లుగానే నడచుకునే జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరన్నారు.


నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలకు పెంపు
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ లు
తిరుపతిలో ఎలక్ట్రానిక్ హబ్
గిట్టుబాటు ధరల కోసం ఐదువేల కోట్ల తో స్థిరీకరణ నిధి
పదిలక్షలలోపు పెట్టుబడులకు వడ్డీలేని రుణాలు
హెల్త్ టూరిజం, హెల్త్ హబ్ లను ఏర్పాటు
ఏటా పసుపు – కుంకుమ నిధులు విడుదల
కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు
విశా‌ఖలో డేటా సెంటర్ ఏర్పాటు
పేదలందరికీ ఇళ్ల నిర్మాణం
రెండుకోట్ల ఎకరాలకు సాగునీరు
డ్వాక్రా మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు
నదుల అనుసంధానం పూర్తి చేస్తాం
కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ
అందరికీ ఉద్యోగాలు
చంద్రన్న బీమా పదిలక్షలకు పెంపు