Home News Politics

మండవకి టిక్కెట్ చాన్స్ మిస్ చేసింది టీఆర్ఎస్ ఎంపీనా…?

SHARE

ఆయన పార్టీలో సీనియర్ లీడర్ , దశాబ్దాల కాలం నుంచి పార్టీకి సేవలందించిన నేత మండవ వెంకటేశ్వరరావు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో యాక్టీవ్ గా ఉన్న మండవ గత ఎన్నికల్లో పోటీకి నిరాకరించారు. అప్పటి నుంచి స్థబ్దుగా ఉన్న మండవ తిరిగి ఈ మధ్య యాక్టివ్ అయ్యారు. తిరిగి నిజామాబాద్ రూరల్ పై సృష్టి పెట్టి పోటీకి సిద్దమయ్యారు. టీఆర్ఎస్ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చిన నిరాకరించి పార్టీలో ఉన్నారు మండవ. కూటమి పొత్తుల్లో నిజామాబాద్ రూరల్ సీట్ తనదే అన్న కాన్ఫిడెన్స్ తో ఆయనకు కి ఎన్నికల వేళ సొంత పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. రూరల్ లో మంచిపట్టున్న ఈ సీనియర్ లీడర్ కి ఓ టీఆర్ఎస్ ఎంపీ ఆడిన గేమ్ తో సీటు మిస్ అవ్వడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రజాకూటమిగా ఏర్పడి పోత్తులు పొడుస్తున్నప్పుడే నిజామాబాద్ తెలుగుదేశం పార్టీ నేతలందరూ కలసి మండవ వెంకటేశ్వరరావుకు టిక్కెట్ కేటాయించాలంటూ తీర్మానం చేసి మరీ చంద్రబాబుకు పంపారు. మండవ కు నిజామాబాద్ రూరల్ స్థానం దక్కుతుందని పార్టీ శ్రేణులు గట్టి నమ్మకంతో ఉండగా అనూహ్యంగా టిక్కెట్ మిస్ అయింది. టీఆర్ఎస్ నుంచి భారీ ఆఫర్లు ఉన్నా పార్టీకి కట్టుబడి ఉన్నా మండవకి అధినేత తీసుకున్న నిర్ణయం షాక్ కి గురి చేసింది.

ఎవరూ ఊహించని విధంగా నిజామాబాద్ రూరల్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అక్కడ ఇటీవలే తెలంగాణ రాష్ట్ర సమితితో విభేదించి పార్టీ కండువాను కప్పుకున్న ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి టిక్కెట్ కేటాయించడంతో మండవ అభిమానులు మండిపడుతున్నారు. నిజానికి సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్, ఎమ్మెల్సీ భూపతి రెడ్డికి మధ్య కొన్నేళ్లుగా పొసగడం లేదు. రెండు వర్గాలు వీధికెక్కి రచ్చ చేశాయి. భూపతి రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తొలుత భావించిన టీఆర్ఎస్ అధిష్టానం వెనక్కు తగ్గింది. అయితే తిరిగి బాజిరెడ్డి గోవర్థన్ కే సీటు కేటాయించడంతో భూపతి రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు.

నిజానికి మండవ వెంకటేశ్వరరావు టీడీపీని వదిలి టీఆర్ఎస్ లోకి వెళతారన్న ప్రచారం గత ఏడాదిగా జరుగుతోంది. అయితే ఆయన పార్టీ మారలేదు. టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ పొత్తు కుదుర్చుకుందో నిజామాబాద్ రూరల్ పై మండవ ఆశలు పెంచుకున్నారు. తనకే అధినేత చంద్రబాబు సీటు కేటాయిస్తారని భావించారు. చంద్రబాబు కూడా ఈసీటు పై గట్టిగానే హామీ ఇచ్చారని తెలుస్తోంది. అయితే అనూహ్యంగా మండవకు మొండిచేయి చూపడం వెనక బలమైన కారణముందంటున్నారు.

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ వర్గం బలంగానే ఉంది. ఆయన కనుసన్నల్లోనే నియోజకవర్గంలో ఒక సామాజికవర్గం నడుస్తూ ఉంది. డీఎస్ టీఆర్ఎస్ వీడి కాంగ్రెస పార్టీలో చేరకపోయినా ఆయన ప్రభావం ఇక్కడ ఉంటుంది. ఆయన కాంగ్రెస్ అభ్యర్థికి పరోక్షంగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. అయితే మండవ అభ్యర్థి అయిన పక్షంలో తాను సహకరించనని డీఎస్ చెప్పడంతో కాంగ్రెస్ టీడీపీకి ఆ సీటు ఇవ్వకుండా తానే తీసుకుని భూపతిరెడ్డికి కేటాయించినట్లు తెలుస్తోంది. మరి మండవ వర్గం భూపతి రెడ్డికి సహకరిస్తుందా? లేదా? అన్నడి ఇక చూడాల్సి ఉంది.