Home News Stories

ఎమ్మెల్సీ రేసులో ఉన్న గూడూరు ఇలా సేఫ్ అయ్యారన్నమాట…!

SHARE

గెలుస్తారో? లేదో ? తెలియదు.. అయినా పోటీకి సిద్దమయ్యారు .. పెద్దఎత్తున స్క్రూటినీ చేసి క్యాండెట్‌ను కూడా ఫిక్స్‌ చేశారు.. సదరు అభ్యర్ధికి కీలకమైన బాధ్యత అప్పజెప్పడంతో ఆయన దానికి ప్రిపేర్‌ అయి గ్రౌండ్‌ వర్క్‌ మొదలుపెట్టారు.. అయితే ఎన్నిక జరగకుండానే ఫలితం ఎలా ఉండబోతుందో తేలిపోయింది.. దాంతో సదరు క్యాండెట్‌ పదవిపోతున్నా అదృష్టం వరించిదని మురిసిపోతున్నారంట.. ఇంతకీ ఎవరా సార్‌ ? ఆయనకు కలిసి వచ్చిన లక్‌ ఏంటి అంటారా? మీరే చూడండి…

గూడూరు నారాయణరెడ్డి … కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ క్యాండెట్‌ .. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్దమైన ఆయన నామినేషన్‌ వేసి గ్రౌండ్‌వర్క్‌ కూడా మొదలుపెట్టారు.. ఆ కోటాలో ఎమ్మెల్సీగా గెలవాలంటే 21 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.. తమకు ఉన్న 19 మందితో పాటు టిడిపి సభ్యులు ఇద్దరు కూడా సపోర్ట్‌ చేస్తారన్న ధీమాతో కాంగ్రెస్‌ నారాయణరెడ్డిని రంగంలోకి దించింది .. ముప్పైమందికి పైగా నేతలు పోటీ పడినా ఆయన్నే ఛాన్స్‌ వరించింది..

అలాంటి గూడురు నారాయణరెడ్డి పరిస్థితి అదృష్టం కలిసివచ్చిందా? పోయిందా? అన్నట్లు తయారైందిప్పుడు .. 21 మంది ఎమ్మెల్యేలు ఓటేస్తే సేఫ్‌గా గెలవవచ్చని అనుకుంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నిక జరగకుండానే గోడ దూకడానికి సిద్దమయ్యారు .. కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, టిడిపి నుంచి ఒకరు తాము టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు .. అంటే ఆ మూడు ఓట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధికి పడే పరిస్థితి లేదు

దాంతో నారాయణరెడ్డి విజయావకాశాలు దూరమైనట్లే.. ఎమ్మెల్సీ పదవి ఆయన చేజారినట్లే .. అయితే ఆ అదృష్టం పోయినా .. మరోరూపంలో ఆయన్ని లక్‌ వరించిందంట.. ఆయనను అభ్యర్ధిగా నిర్ణయించే ముందు ఎన్నికల్లో బోల్డు ఖర్చుపెట్టుకున్న ఎమ్మెల్యేలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారంట కాంగ్రెస్‌ పెద్దలు.. దాంతో వారెవరు క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడకుండా చూసుకోవడానికి గూడూరు నారాయణరెడ్డి పెద్దమొత్తమే తీసి పక్కనపెట్టుకున్నారంట..

పార్టీ మారతామంటున్న ఎమ్మెల్యేలు ముందుగానే ప్రకటించకుండా ఉండిఉంటే గూడూరువారికి గట్టిగానే చేతిచమురు వదిలేది అంటున్నారు .. వారు ఆ ప్రకటన చేయకుండా ఉండిఉంటే అందర్నీ జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చేది ఆయనకి .. ఎలక్షన్‌ దాకా ఆ ముగ్గురు పార్టీ మారకుండా సొంత పార్టీల్లోనే ఉండి ప్రత్యర్ధికి ఓట్లేసి ఉంటే అసలుకే మోసం వచ్చేది ఆయన విషయంలో .. ఏదేమైనా ఎన్నిక ముందే క్లారిటీ వచ్చేయడంతో ఎవర్నీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయిందంట మన అభ్యర్ధికి… అదీ ఒకరకంగా అదృష్టమే కదా?