Home Entertainment Cinema

టాక్సీవాలా ని టెన్సన్ పెడుతున్న మూడుగంటల ట్రైలర్….!

SHARE

రెండుంబావు గంటల సినిమాకు మూడు గంటల ట్రైలర్ లా ఉంది టాక్సీవాలా సినిమా సీన్. ఇప్పటికే చాలాసార్లు రిలీజ్ డేట్ వాయిదాపడుతూ వస్తున్న ఈ సినిమా పై ఆన్ లైన్ పైరసీ బూతం గురిచూసి కొట్టింది. మరో మూడు రోజుల్లో థియోటర్లలో విడుదలవ్వాల్సిన సినిమా మూవీ రూల్జ్‌, టోరెంట్ సైట్లతో నెట్ ఇంట హల్ చల్ చేస్తుంది.

మూలిగే నక్కపై తాటి కాయాల రిలీజ్ వాయిదాపడుతూ దర్శకుడు రాహుల్ సంక్రీత్యాన్ తీసిన ఈ రెండుంబావు గంటల సినిమాకి ఎడిట్ కానీ రఫ్ కాపీ మూడు గంటల సినిమా నెట్లో దర్శనమిస్తుంది. గత రెండు మూడు వారాలకు పైగా దీని పోస్ట్ ప్రొడక్షన్ మీద అహోరాత్రాలు కష్టపడుతున్న రాహుల్ బృందం పైరసీ న్యూస్ విన్నప్పటి నుంచి దాన్ని నెగటివ్ గా కాకుండా పాజిటివ్ గా తీసుకోవడం మొదలుపెట్టింది. ప్రీ రిలీజ్ లో విజయ్ దేవరకొండ చెప్పినట్టు కంటెంట్ తో కొట్టి కలెక్షన్ల రూపంలో పైరసీతో వెక్కిరిస్తున్న వాళ్లకు సమాధానం చెప్పాలని గట్టిగా డిసైడ్ అయ్యారు.

రాహుల్ మాత్రం అవుట్ ఫుట్ మీద చాలా నమ్మకంతో ఉన్నాడు. టాక్సీవాలా గురించి తాను చాలా గర్వంగా ఫీలవుతున్నానని సక్సెస్ అవుతుందన్న భరోసా తనకు ఉందని ఎన్ని నిద్ర లేని రాత్రులు కన్నీళ్లు నిండిన కళ్ళతో గడిపామో తన టీమ్ కు తెలుసని ఫలితం వచ్చాక మాట్లాడతాను అని అంటున్నాడు.

సోషల్ మీడియాలో సైతం టాక్సీవాలా గురించిన చర్చే ఎక్కువగా జరుగుతోంది. తమను ఎవరో రెచ్చగొట్టడం వల్లే ఈ వెర్షన్ పెడుతున్నామని మెసేజ్ చేసిన పైరసీ మ్యాన్స్ తమ పైత్యానికి కారణాలు వెతుక్కోవడం మరో ట్విస్ట్. నిజానికి టాక్సీవాలా సెన్సార్ అయిన ఫైనల్ వెర్షన్ ఉన్నది 2 గంటల 15 నిమిషాలే. కానీ టైటిల్స్ – గ్రాఫిక్స్ ఇవేవి లేకుండా పైరసీలో బయటికి వచ్చిన ప్రింట్ లో మాత్రం 3 గంటల 25 నిమిషాల ఫుటేజ్ ఉంది. ఇదే మాట అంటే అదో ట్రైలర్ లా భావించి స్పోర్టివ్ గా తీసుకోమంటున్నాడు రాహుల్.