Home News

రెడ్ స్మగ్లర్ల పై టాస్క్‌ఫోర్స్ సైలెంట్ వెనుక ఎవరు…?

SHARE

నిత్యం తుపాకులు, రాళ్ల దాడులతో దాడులకు తెగబడే స్మగ్లర్లుకు చుక్కలు చూపించి ప్రకృతి సంపదను కాపాడిన టాస్క్ ఫోర్స్‌కు ఏమైంది? …. ఎర్రచందనం స్మగ్లర్లు తిరిగి రెచ్చిపోతున్నారన్న సమాచారం ఉన్నా ఎందుకు సైలెంట్ అయ్యారు? .. ఎన్నికల వేళ పూర్తిగా కనిపించకుండా పోయిన స్మగ్లర్లు … ఇప్పుడు బ్యాక్ టూ శేషాచలం అంటున్నారు. తమిళ కూలీలతో శేషాచలంలో అడుగుపెట్టినట్లు తెలిసినా రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ యాక్షన్‌ ప్లాన్‌ కనిపించకపోవడం ఇప్పుడు మిస్టరీగా మారింది … అసలు టాస్క్‌ఫోర్స్ ఎందుకు సైలైంట్‌ అయింది..?

శేషాచలం అడువులు 5 లక్షల హెక్టార్లతో విస్తరించి ఉన్నాయి .. ఆ అడవుల్లో మాత్రమే కనిపిస్తుంటాయి నెంబర్‌ 1 క్వాలిటీ ఉన్న ఎర్రచందనం వృక్షాలు … అందుకే ఈ ఎర్రచందనానికి ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా చైనా, జపాన్‌తోపాటు గల్ప్ దేశాలలో మంచి డిమాండ్ … దాన్ని బేస్‌ చేసుకుని శేషాచలం అడువుల నుంచి రెడ్‌శాండిల్‌ స్మగ్లింగ్‌ విచ్చలవిడిగా సాగుతోంది … లారీ క్లీనర్లు జీవితం ప్రారంభించిన వారు స్మగ్లర్లుగా మారి వందల కోట్లు సంపాదించారు…

తమిళనాడు స్మగ్లర్లు కూడా ఎర్రచందనం రవాణాలో ఆరితేరిపోయారు.. దుబాయి కేంద్రంగా పనిచేసే వారు గత పదేళ్లలో సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేసినట్లు అంచనా .. అందుకు రకరకాల వాహనాలు వినియోగిస్తూ భద్రతాసిబ్బందిని బోల్తా కొట్టిస్తుంటారు .. ఎన్నికల సీజన్లో కాస్త సైలెంట్‌ అయినట్లు కనిపించిన ఆ స్మగ్లర్లు తిరిగి తమ దందా మొదలెట్టారు.

ఎర్రచందనం అతిపెద్ద ఆదాయవనరుగా మారడంతో స్మగ్లర్లు యథేచ్చగా రెచ్చిపోతున్నారు .. గతంలో దాదాపు 20 మంది వరకు ఎన్‌కౌంటర్లలో మరణించినా వారి అరాచకాలు మాత్రం ఆగడం లేదు… వారిని అరికట్టడానికి ఏపి ప్రభుత్వం ప్రత్యేక ట్రాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినా పూర్తిస్థాయిలో కట్టడి చేయలేకపోతోంది … టాస్క్‌ఫోర్స్ పూర్తి స్ధాయిలో పనిచేస్తు అక్రమ రవాణ చేసేవారిని అరెస్టు చేసినప్పుడు కూడా .. స్మగ్లర్లు కొత్తదారులు వెతుక్కుంటూ అక్రమరవాణా సాగించారు . చైనా, జపాన్, గల్ఫ్‌ దేశాల్లో రెడ్‌శాండిల్‌తో తయారు చేసిన వస్తువులంటే లగ్జరీ సింబల్‌గా భావిస్తారు … ఎర్రచందనం పొడిని వయాగ్రాలో తయారుచేసే మందుల్లో కూడా వాడతారు… అందుకే విదేశీ మార్కెట్ లో ఈ ఎర్రచందనానికి అంత డిమాండ్ ఉంది.

ఎన్నికల వరకు దుకుడుగా ఉన్న స్మగ్లర్లు తమిళనాడు, ఏపిలో ఎన్నికల సమయానికి గప్‌చుప్‌ అయ్యారు … ముఖ్యంగా ఏపిలో ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున చెక్‌పోస్టులు, పోలీసుల తనిఖీలు ఉండటంతో ఎర్ర కూలీలు సైలెంట్‌ అయిపోయారు … తరువాత తమిళనాడు ఎన్నికల రావడంతో స్మగ్లర్లు అందరూ సొంత ఊళ్లకే పరిమితమయ్యారు.. ఎన్నికల హడావుడి ముగిసినప్పటి నుంచి తిరిగి శేషాచలం అడవుల్లో వారి హడావుడి మొదలైంది. ఇప్పటికే భారీ సంఖ్యలో స్మగ్లర్లు గుట్టుచప్పుడు కాకుండా శేషచలంలో తిష్ట వేసినట్లు ప్రచారం జరుగుతోంది … అయితే టాస్క్ ఫోర్స్ మాత్రం మునుపటి జోరు కొనసాగించడం లేదనే విమర్శలు వినపడుతున్నాయి.

స్మగ్లర్లు అడవుల్లోకి వచ్చారనే సమాచారం ఉన్నా వారిని పట్టుకోవడంపై వారు దృష్టి పెట్టకపోతుండటం చర్చనీయాంశమవుతోంది. గత నాలుగు ఐదు నెలలుగా టాస్క్ ఫోర్స్ పట్టుకున్న స్మగ్లర్లు, సీజ్ చేసిన ఎర్రచందనం, నమోదైన కేసులు నామమాత్రంగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది.. అసలు ట్కాస్క్ ఫోర్స్ ఎందుకు సైలెంట్ అయ్యిందన్న దానిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి … వారి ఉదాసీనతను క్యాష్‌ చేసుకుంటూ రెచ్చిపోతున్న స్మగ్లర్లు కోట్లాది రూపాయల ఎర్రబంగారాన్ని సరిహద్దలు దాటిస్తున్నట్లు స్థానికులు చెప్తున్నారు .. టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందే కాకుండా రెడ్ శాండిల్ స్పెషల్ టీం కూడా అక్రమ రవాణాపై దృష్టి పెట్టకపోవడం రకరకాల చర్చలకు దారితీస్తోంది