Home Women Recipes

తండూరీ ఫిష్ తయారుచేయు విధానం

SHARE

తండూరీ ఫిష్ తయారుచేయు విధానం… ముందుగా చేపలను శుభ్రంచేసి ఉప్పుతో బాగా కడిగి ఉంచండి. వాటికి చాకుతో అడ్డంగా, నిలువుగా గాట్లు పెట్టండి. ఆ తర్వాత ఆ గాట్లలో కొంచం ఉప్పు, నిమ్మరసం పట్టించి…..

కావలసిన పదార్థాలు :
కొర్రమీను లేదా కందువా చేపలు : 500 గ్రా., పెరుగు : అరకప్పు, కారంపొడి : 15 గ్రా., వాము : 1 టీ స్పూన్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2 టీ స్పూన్లు, నిమ్మకాయలు : 2, కొత్తిమీర : ఒక కట్ట, జీలకర్ర పొడి : అర టీ స్పూన్, ఫుడ్ కలర్ : చిటికెడు, రిఫైన్డ్ ఆయిల్ : 25 గ్రా., ఉప్పు : తగినంత

తండూరీ ఫిష్ తయారుచేయు విధానం

తయారుచేయు విధానం :ముందుగా చేపలను శుభ్రంచేసి ఉప్పుతో బాగా కడిగి ఉంచండి. వాటికి చాకుతో అడ్డంగా, నిలువుగా గాట్లు పెట్టండి. ఆ తర్వాత ఆ గాట్లలో కొంచం ఉప్పు, నిమ్మరసం పట్టించి.. పావుగంట పక్కనుంచండి. తర్వాత వాటిని మీడియం సైజులో ముక్కలు చేయండి.

ఇప్పుడు ఒక ప్లేటులో చిక్కటి పెరుగు తీసుకుని దానిలో అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, వాము, జీరా పొడులను కలిపి తర్వాత కొద్దిగా ఉప్పు, నూనె, ఫుడ్ కలర్ ను కలిపి బాగా కలియబెట్టండి. దానిలో సన్నగా తరిగిన కొత్తిమీర కలిపితే చేపల ముక్కల్ని నానబెట్టేందుకు మసాలా సిద్ధమైనట్లే.

ఇలా తయారుచేసిన మసాలాను చేప ముక్కలకు బాగా పట్టించి అర్థగంటసేపు బాగా నానబెట్టండి. ఆ తర్వాత వాటిని ఊచలకు గుచ్చి వేడి తందూరీ పొయ్యిలో గానీ, మైక్రోవేవ్ ఓవెన్ లో గానీ సుమారు 150 డిగ్రీల సెల్సియస్ వరకు ఉడికించండి. అంతే నోరూరించే తందూరీ ఫిష్ తయారవుతుంది.

ఓవెన్ గానీ, తందూరీ పొయ్యి గానీ లేనివాళ్లు సాధారణ పొయ్యి మంట మీద సన్నటి ఊచలకు గుచ్చిన చేపముక్కల్ని పది నిముషాలు కాల్చితే చాలు తందూరీ ఫిష్ సిద్ధమైనట్లే.