Home News

టీ కాంగ్రెస్ రివర్స్ ఆపరేషన్…!

SHARE

కాంగ్రెస్ రివర్స్ ఆపరేషన్ మొదలు పెట్టిందా..? బీజేపీ తరహాలోనే… ఘర్ వాపసీ కి శ్రీకారం చుట్టిందా అనేది ఇప్పుడు తెలంగాణలో హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్… మాజీ ఎంపీ వివేక్ భేటీ ఈ చర్చకు తెరలేపింది. కాంగ్రెస్ నుండి… చాలా మంది నాయకులు బీజేపీ గూటికి చేరుతున్నారు…ఈ క్రమంలో వివేక్ తో..ఉత్తమ్ భేటీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో వివేక్ భేటీ అవ్వడంతో బీజేపీలో చేరిపోతున్నారన్న చర్చ జరిగింది. కానీ…పీసీసీ చీఫ్ ఉత్తమ్… వివేక్ ఇంటికి వెళ్ళి చర్చలు జరపడంతో కాంగ్రెస్ రివర్స్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది….

తెలంగాణలో వరుస చేరికలను ప్రోత్సహిస్తూ కమలం పార్టీ దూకుడు ప్రదర్శిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ అలర్టైంది. ఇదే రీతిలో కాంగ్రెస్ నుంచి వలసలు ఉంటే అసలుకే మోసం అని భావించిన టీపీసీసీ పెద్దలు దిద్దుబాటు చర్యలకు దిగారు. కాంగ్రెస్ ప్రక్షాళన కి సిద్ధం అయ్యింది… సమగ్రంగా మారిపోతుంది అంటూ స్టేట్మెంట్లు అయితే వచ్చాయి. కానీ పరిస్థితులు చూస్తుంటే… అలాంటి పరిణామాలు మాత్రం కనిపించడం లేదు. ఏఐసీసీ లో నెలకొని ఉన్న పరిణామాలు… వారం..పది రోజుల్లో సెట్ అవుతుంది అనుకున్నారు. కానీ రెండు నెలలు గడుస్తున్నా… పరిస్థితి లో మార్పు మాత్రం లేదు. దీంతో ప్రస్తుత నాయకత్వంతోనే టీ కాంగ్రెస్ ని మరి కొన్నాళ్ళు నడిపించాలని ఏఐసీసీ భావిస్తున్నట్టు సమాచారం.

ఒక్కొక్కరుగా పార్టీని విడిచిపెట్టి వెళ్లటం… బీజేపీ కూడా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తుండటంతో పార్టీ వదిలి వెళ్ళిన వారిని తిరిగి చేర్చుకునే ప్యూహం పై కాంగ్రెస్ దృష్టిపెట్టింది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు కూడా పెట్టాలని ప్రభుత్వం చూస్తున్న క్రమంలో… అటు టిఆర్ఎస్ కూడా… పార్టీలో మిగిలిన నాయకులను కూడా లాక్కుంటుంది. ప్రస్తుత పరిస్థితి నుండి పార్టీని నిలబెట్టాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ లోని అసంతృప్త నేతల పై కూడా దృష్టిసారించింది.

అనే చర్చకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ పులిస్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యారా..? దాంట్లో భాగంగానే…మాజీ ఎంపీ వివేక్ తో భేటీ అనే చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నుండి చాలా మంది నాయకులు బీజేపీ లో చేరబోతున్నారు అనే చర్చ జరుగుతున్న క్రమంలో… వివేక్ తో..ఉత్తమ్ భేటీ చర్చనీయాంశం అయ్యింది. ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన వివేక్… బీజేపీలో చేరిపోతున్నారు అనే చర్చ జరిగింది. కానీ…పీసీసీ చీఫ్ ఉత్తమ్… వివేక్ ఇంటికి వెళ్లడం తో… వివేక్ ని తిరిగి కాంగ్రెసులో చేరాలని కొరినట్టు తెలుస్తుంది.

మాజీ ఎంపీ వివేక్ తో ఉత్తమ్ సుదీర్ఘ మంతనాలు జరిపారు. బీజేపీ కేవలం గేమ్ ఆడుతుంది…కానీ ఎవరూ ఆ పార్టీలో చేరబోరని వివేక్ తో భేటీ సందర్భంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ లోకి వివేక్ ని స్వాగతించారు.
త్వరలోనే మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో కి చేరాలని వివేక్ ని ఒప్పించే ప్రయత్నం చేసిన ఉత్తమ్…ని వివేక్ కొంత గడువు కొరినట్టు సమాచారం. ఒకటి..రెండు రోజుల్లో వివేక్ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

వివేక్ … బీజేపీ లోకి వెళ్లడం ఆగిపోయిందా..? ఉత్తమ్… వివేక్ మనసు మార్చగలిగారా..? అనే ప్రశ్నలకు రెండు..మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. !