Home News Politics

టీ కాంగ్రెస్ ముందస్తు మ్యానిఫెస్టో అదిరిపోయిందిగా!

SHARE

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమైనట్లే. అధికార టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికల గోదాలో దూసుకుపోతుండటంతో టీ కాంగ్రెస్‌ పార్టీ కూడా దూకుడు పెంచింది. ముందస్తు ఎన్నికలు పక్కా అనే విషయం స్పష్టమవ్వడంతో తాము కూడా ఎన్నికలకు రెడీ అంటూ ముందస్తు మ్యానిఫెస్టో రిలీజ్ చేసింది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్‌ రెడ్డి నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ సమావేశం నిర్వహించి అధికార టీఆర్ఎస్ ని తలదన్నేలా తాయిలాలు ప్రకటించింది. బీపీఎల్ కుటుంబాలకు 6 గ్యాస్ సిలీండర్లు ఉచితం, తెల్లరేషన్‌ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలతో మద్యతరగతి,దిగువ మద్య తరగతిని చేరువ చేసుకునేలా ప్రణాళిక సిద్దం చేసుకుంది. ఆర్థిక నిపుణులతో చర్చించి హామీలు ఇస్తున్నామన్న
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి రెండు మూడు వారాల్లో నియోజకవర్గ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తామన్నారు.

కమిటీ ప్రతిపాదనలలోని ముఖ్యాంశాలు.

తెల్లరేషన్‌ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ.
తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక్కో వ్యక్తికి 6 కిలోలు సన్నబియ్యం
బీపీఎల్‌ కుటుంబాలకు 6 గ్యాస్‌ సిలెండర్లు ఉచితం
దళిత, గిరిజనులకు సన్నబియ్యం ఉచితం.
ఇల్లు లేనివారికి రూ.5లక్షలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మరో రూ.లక్ష అదనంగా ఇస్తాం.
మిడ్‌ మానేరు నిర్వాసితులకు రెండు పడకల గదుల ఇళ్లు
కల్యాణలక్ష్మి, బంగారు లక్ష్మి పథకం కొనసాగిస్తాం.
దివ్యాంగుల వివాహానికి రూ.2లక్షలు ఇస్తాం.
ఇందిరమ్మ ఇంటికి మరో గది నిర్మాణానికి రూ.2లక్షలు అందిస్తాం.
బీసీ, మైనారిటీలకు సబ్‌ ప్లాన్‌
ఉపాధి కల్పనకు ప్రాధాన్యత
ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల విద్యుత్‌ ఉచితం
మత ప్రార్థన స్థలాలకు కొంత ఉచిత విద్యుత్
7వ తరగతి నుంచి ఇంటర్ చదివే అమ్మాయిలకు సైకిల్
ఆరోగ్య శ్రీ పరిధి రూ.5 లక్షల వరకు పెంపు.అన్ని రకాల వ్యాధులకు వర్తింపచేస్తాం
లీటరు పాలకు రూ.4 ప్రోత్సాహకం
గల్ఫ్ బాధితుల కోసం రూ.500 కోట్ల నిధి
కౌలు రైతులను కూడా రైతులుగా గుర్తిస్తాం..
మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మేం అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ వి కొనసాగిస్తూ తమదైన స్టైల్ లో మరిన్ని పథకాలతో మ్యానిఫెస్టో అదిరిపోయేలా డిజైన్ చేసింది..