Home News

తెలంగాణ కాంగ్రెస్ అజ్ణాతవాసి…!

SHARE

తెలంగాణ రాజకీయాల్లో ఆయనెప్పుడు హాట్‌ టాపిక్కే .. ప్రత్యర్ధులపై విమర్శలు చేసినా, సొంత పార్టీ నేతలపై సెటైర్లు వేసినా ఆయనకు ఆయనే సాటి . .. నాయకులకు నీతి నియమాలు ఉండాలంటూ కొత్త పల్లవి అందుకున్నా… పార్టీలోనే ఉంటా కానీ… వాళ్లు చెప్పినవన్నీ చెయ్యను… అంటూ నయా ట్విస్ట్‌ ఇస్తున్నారు .. ఒకప్పుడు పార్టీలు మారిన ఆయన ఇప్పుడు అదే విషయమై నీతులు చెపుతూనే .. పార్టీ కార్యక్రమాల్లో సడన్‌గా గాయబ్‌ అయిపోతున్నారు .. ఇంతకీ ఎవరా అజ్ఞాతవాసీ…?

జగ్గారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరంలేని నాయకుడు… ఓడినా… గెలిచినా… ఆయన రూటే సెపరేట్… ఏదో ఒక రూపేణా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు జగ్గారెడ్డి… తాజాగా ఆయన వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశమైంది… కాంగ్రెస్ శాసనసభపక్షాన్ని టీఆర్ఎస్ లో వీలినయం చేసుకోడానికి నిరసనగా అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలియజేశారు…భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క, పోడెం వీరయ్య నల్లకండువాలతో అసెంబ్లీకి వచ్చారు. సభలో నినాదాలు చేసిన నిరసన వ్యక్తం చేశారు… అయితే ఈ వ్యవహారమంతటికీ జగ్గారెడ్డి దూరంగా ఉండిపోయారు… సీఎల్పీ ఆఫీస్ లో అందరితో కలిసి కనిపించిన జగ్గారెడ్డి సరిగ్గా సభలో నిరసన తెలియజేసే సమయానికి గాయబ్ అయ్యారు… అసలే వలసల కాలం… అదీ అధికారపక్షం నుంచి ఆఫర్ ఉన్న నాయకుడు కావడంతో ఒక్కసారిగా అందరి దృష్టి జగ్గారెడ్డి వైపు మళ్లింది…


ఇప్పటి వరకు పార్టీ నేతలతో ఉన్న జగ్గారెడ్డికి ఏమైంది? ఏం చేయబోతున్నారంటూ? అంతా ఆరాలు తీయడం మొదలెట్టారు … కట్ చేస్తే… ఆయన చెప్పిన కారణం అందర్నీ ఆలోచనలో పడేసింది… వైఎస్ సీఎంగా ఉండగా టీఆర్ఎస్ లోఉన్న జగ్గారెడ్డి కాంగ్రెస్ లో చేరిపోయారు… అప్పట్ల్లో దీనిపై టీఆర్ఎస్ చాలా ఆందోళనలు చేసింది. ఆయన మీద అనర్హత వేటు వేయాలని డిమాండ్‌ చేసింది..

ఆ తర్వాత జగ్గారెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు… మళ్లీ బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చారు … ఇన్నిసార్లు పార్టీ మారిన తనకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అడిగే హక్కు లేదని… అది నైతికత కాదన్నది జగ్గారెడ్డి వివరణ… పార్టీలో కూడా ఇది చర్చకు దారి తీసింది. .. జగ్గారెడ్డి తీరుపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరణ కోరారు… ఆయనకూ అదే సమాధానం చెప్పారట జగ్గారెడ్డి…. మీరు ఏమైనా అనుకోండి… రెండు పార్టీలు మారిన నేను నైతిక విలువల గురించి మాట్లాడితే బాగోదు… అందుకే ఆ విషయంలో దూరంగా ఉన్నా…. అని చెప్పారట.


జగ్గారెడ్డికి ఇప్పటికే టిఆర్ఎస్ నుండి ఆఫర్ వచ్చింది… దీంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న జగ్గారెడ్డి పార్టీ మారతారు అనుకున్నారు.. అయితే నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరిస్తే పార్టీ మారే విషయం ఆలోచిస్తానని … తన వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ మారబోనని స్పష్టం చేశారు జగ్గారెడ్డి… అయితే ప్రెజెంట్‌ నిరసన ఎపిసోడ్‌కి ఆయన దూరంగా ఉండటం … దానిపై తనదైన లాజివ్‌ వినిపించడం చర్చనీయాంశంగా మారింది.. ఏవో వ్యక్తిగత సమస్యల వల్ల… జగ్గారెడ్డి సభలో ఇలా వ్యవహరించార్న చర్చ జరుగుతోంది …