Home Women Health

హాయిగా నిద్రపోండి: నిద్రతగ్గితే మధుమేహం ప్రమాదం ఎక్కువ

SHARE

హాయిగా నిద్రపోండి: నిద్రతగ్గితే మధుమేహం ప్రమాదం ఎక్కువ:తగినంత నిద్ర లేకపోతే మధుమేహం ముప్పు పెరిగే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. శరీరానికి ఇన్సులిన్‌ పట్ల సునిశితత్వం తగ్గడం, రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించే సామర్థ్యం తగ్గిపోవడం వల్ల ఇలాంటి సమస్య తలెత్తుతుందని కొలరాడో బౌల్డర్‌ యూనివర్సిటీ పరిశోధకులు కెన్నెత్‌ రైట్‌జూనియర్‌ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయం ఏదైనా తిన్నప్పుడు, రక్తంలో చక్కెర నిల్వల్ని నియంత్రించుకునే సామర్థ్యం తగ్గుతుందన్నారు.

తగినంత నిద్ర లేకపోతే మధుమేహం ముప్పు పెరిగే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. శరీరానికి ఇన్సులిన్‌ పట్ల సునిశితత్వం తగ్గడం, రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించే సామర్థ్యం తగ్గిపోవడం వల్ల ఇలాంటి సమస్య తలెత్తుతుందని కొలరాడో బౌల్డర్‌ యూనివర్సిటీ పరిశోధకులు కెన్నెత్‌ రైట్‌జూనియర్‌ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయం ఏదైనా తిన్నప్పుడు, రక్తంలో చక్కెర నిల్వల్ని నియంత్రించుకునే సామర్థ్యం తగ్గుతుందన్నారు.

హాయిగా నిద్రపోండి: నిద్రతగ్గితే మధుమేహం ప్రమాదం ఎక్కువ

ఈ పరిశోధనలో భాగంగా కొంతమందిని పరిశీలించినప్పుడు ఒక రాత్రివేళ ఐదు గంటలపాటు నిద్రపోయిన వారిలో ఇన్సులిన్‌పట్ల సునిశితత్వం తగ్గినట్లు గుర్తించారు. ఇది మధుమేహం ముప్పు పెరిగేందుకు దారితీస్తున్నట్లు తేలింది. అదే తొమ్మిది గంటలపాటు నిద్రపోయిన వారిలో ఇన్సులిన్‌ సునిశితత్వం సాధారణ స్థితికి చేరినట్లు గుర్తించారు. దీనంతటికీ నిర్దిష్టమైన కారణాలు తెలియకపోయినా, నిద్రలేమి జీవక్రియ ఒత్తిడికి కారణమవుతుండవచ్చని వివరించారు.

హాయిగా నిద్రపోండి: నిద్రతగ్గితే మధుమేహం ప్రమాదం ఎక్కువ

కొంతమంది తక్కువ సమయం నిద్రపోవడం ఈమధ్యకాలంలో ఎక్కువైంది. కనీసం రోజుకు 6 నుంచి 7 గంటలు నిద్రపోవడం మంచిదంటున్నారు డాక్టర్లు. అందుకే రోజూ హాయిగా నిద్రపోండి. లేకుంటే మధుమేహం మీపై మోహం పెంచుకుంటుంది జాగ్రత్త.