Home News Updates

ఆర్.విద్యాసాగ‌ర్ రావు జీవితం ఆద‌ర్శం: సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి

ఆర్.విద్యాసాగ‌ర్ రావు జీవితం ఆద‌ర్శం: సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి

SHARE

– తెలంగాణ నీటి లెక్క‌ల‌ను తేల్చిన నిపుణుడు
– అన్యాయాన్ని వివ‌రించి ప్ర‌జ‌ల‌ను జాగృతం చేశారు
– తెలంగాణ ఉద్య‌మంలో ఆయ‌న పాత్ర మ‌ర‌వ‌లేనిది
– నాడు నీటి లెక్క‌లు తేల్చి నేడు నీళ్లు వ‌స్తుంటే లేక‌పోవ‌డం బాధాక‌రం
– రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి


తెలంగాణ ఉద్య‌మంలో తెలంగాణ రాష్ట్రానికి స‌మైక్య పాల‌కులు నీటి పంపిణీ విష‌యంలో చేసిన అన్యాయాన్ని లెక్క‌ల‌తో స‌హా వివ‌రించి సీమాంధ్ర పాల‌కుల వాద‌న‌ను ఎండ‌గ‌ట్టారు. ఎక్క‌డెక్క‌డ నీటి పంపిణీలో అన్యాయం జ‌రిగింది తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మ‌య్యేలా వివ‌రించి తెలంగాణ రాష్ట్ర సాధన‌లో త‌న వంతు పాత్ర పోషించి, ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారితో అడుగులు వేసిన‌ సాగునీటి రంగ నిపుణులు, రిటైర్డు చీఫ్ ఇంజ‌నీర్ కీర్తిశేషులు ఆర్.విద్యాసాగ‌ర్ రావు గారి జీవితం ఆద‌ర్శ‌నీయ‌మ‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి గారు అన్నారు.

ఆర్.విద్యాసాగ‌ర్ రావు గారి రెండో వ‌ర్ధంతి సంధ‌ర్భంగా ఆయ‌న‌ చిత్ర‌ప‌టానికి సోమ‌వారం వ‌న‌ప‌ర్తి ప‌ట్ట‌ణంలోని త‌న స్వ‌గృహంలో పార్టీ శ్రేణుల‌తో క‌లిసి నివాళులు అర్పించారు. తెలంగాణ నీటి లెక్క‌ల‌ను తేల్చిన విద్యాసాగ‌ర్ రావు స్వ‌రాష్ట్రంలో తెలంగాణ ఇప్పుడు న‌ష్ట‌పోయిన నీళ్ల‌ను తెచ్చుకునే స‌మ‌యంలో లేక‌పోవ‌డం బాధాక‌రం అని అన్నారు. తెలంగాణ‌కు నీటి కేటాయింపులపై జ‌రిగిన అన్యాయాన్ని అనేక దిన‌ప‌త్రిక‌ల‌లో వంద‌కు పైగా వ్యాసాలు రాశార‌ని, నీళ్లు – నిజాలు పేరుతో వెలువ‌రించిన రెండు సంపుటాల‌ను చ‌దివితే తెలంగాణ ఎంత న‌ష్ట‌పోయింది అన్న‌ది స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతుంద‌ని నిరంజ‌న్ రెడ్డి గారు అన్నారు. ఉద్య‌మ స‌మ‌యంలో సాగునీటి రంగంలో ఆయ‌న ప్ర‌ముఖ‌పాత్ర పోషించార‌ని, పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను కూడా త‌న ర‌చ‌న‌ల‌లో వివ‌రించార‌ని అన్నారు. 2014లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (భారతదేశం) ఆయనను “లీడింగ్ ఇంజనీరింగ్ పెర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా పుర‌స్కారంతో స‌న్మానించింద‌ని, ఆయ‌న మ‌ర‌ణం తెలంగాణ‌కు తీర‌నిలోట‌ని నిరంజ‌న్ రెడ్డి గారు అన్నారు.