Home Entertainment Cinema

సిగరెట్ తో స్నేహం పంచుకున్న అపూర్వ సహోదరులు…

SHARE

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘యన్‌టీఆర్’ బయోపిక్‌పై భారీ క్రేజ్ ఉంది. అయితే ఈ బయోపిక్ విషయంలో రోజుకో సర్‌ప్రైజ్ బయటకు వదులుతూ ప్రేక్షకులను ఖుషీ చేస్తోంది ‘యన్‌టీఆర్’ చిత్ర యూనిట్. ఇండస్ట్రీలో హీరోల స్నేహం గురించి ఎంత చెప్పుకున్న ఎన్టీఆర్-ఏ ఎన్ఆర్ ల బంధమే ఎవర్ గ్రీన్. ఆనాటి నటీనటుల రూపాలను వెండితెరపై చూడాలని కుతూహలంగా ఫ్యాన్స్ కి మళ్ళీ ఒక ట్రీట్ ఇచ్చింది చిత్ర యూనిట్.

ఎన్‌టీఆర్ చిత్రంలో ఏఎన్ఆర్‌గా ఆయ‌న మ‌న‌వ‌డు సుమంత్ న‌టిస్తున్నారు. అయితే ఏఎన్ఆర్ లుక్‌లో ఉన్న సుమంత్‌, ఎన్‌టీఆర్ లుక్‌లో ఉన్న బాల‌కృష్ణ‌లు ఇద్ద‌రూ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న మ‌రో పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్‌గా బాల‌య్య‌, చంద్ర‌బాబుగా రానా లుక్స్ మాత్ర‌మే విడుద‌ల కాగా తాజాగా ఏఎన్ఆర్ లుక్‌తో ఫ్యాన్స్‌లో మ‌రిన్ని అంచ‌నాల‌ను పెంచేసింది ఎన్టీఆర్ బయోపిక్ ..!


అక్కినేని నాగేశ్వర్ రావు 94వ జయంతి సందర్భంగా సినిమాలోని ఏఎన్నార్‌ లుక్‌ను సుమంత్‌ ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. ఈ పిక్‌ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న సుమంత్.. ‘‘ఆ నాటి సహోదరత్వాన్ని మరోసారి క్రియేట్ చేస్తున్నాం’’ అని ట్యాగ్ చేశారు. తాజాగా విడుదలైన ఈ పోస్టర్‌లో అక్కినేని నాగేశ్వర్ రావుగా సుమంత్, ఎన్టీఆర్‌గా బాలకృష్ణ దర్శనమిచ్చారు. పోస్టర్‌లో ఎన్టీఆర్‌కి సిగరెట్ వెలిగిస్తూ కనిపించాడు ఏఎన్‌ఆర్. ఈ రెండు పాత్రలలో సుమంత్, బాలకృష్ణ లను చూస్తుంటే స్వయంగా ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ దిగొచ్చారా ఏంటి? అనే ఫీలింగ్ కలుగుతోంది. ఎంతో ఆకట్టుకుంటున్న ఈ పోస్టర్ విడుదలైన కాసేపట్లోనే వైరల్‌గా మారి సంచలనం సృష్టించింది.

ఇద్దరి మధ్య సై అంటే సై అనుకునే బాక్స్ ఆఫీస్ పోటీ ఎంత ఉన్నా బయట మాత్రం ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మెలిగేవారని వీళ్ళ ఫ్రెండ్ షిప్ ని దగ్గరనుంచి చూసినవాళ్ళు ఇప్పటికీ కథలుగా చెబుతారు. ఇప్పటివరకు చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్స్ చూస్తే మాత్రం.. పాత్రల విషయంలో చిత్రబృందం మంచి నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అక్కినేని అభిమానుల‌తోపాటు నంద‌మూరి ఫ్యాన్స్‌ను కూడా ఈ పోస్ట‌ర్ అల‌రిస్తోంది. ఎన్‌టీఆర్ బ‌యోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్‌టీఆర్ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుండటంతో సినిమా పై మంచి హైప్ నెలకొంది.