సాక్షి మీడియా గ్రూప్ లో భారీ మార్పులకు స్కెచ్ సిద్దమైనట్లు మీడియా సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. గత కొంత కాలంగా సాక్షిలో జరుగుతున్న పరిణామాల పట్ల వైఎస్ అభిమానుల్లో సైతం అసహనం వ్యక్తమవుతుంది.అటు పత్రిక విషయంలోనూ పాఠకుల సంఖ్య తగ్గడం, సోషల్ మీడియాలో సాక్షి కథనాలపై సెటైర్లతో విరుచుకుపడుతున్నవారి సంఖ్య పెరగడంతో కొన్ని షాకింగ్ నిర్ణయాలు తీసుకోనే ఆలోచనలో సాక్షి యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తుంది.
ఒక వైపు ఎన్నికలు దగ్గరపడుతున్నా ఆ వేడి సాక్షి పేపర్ లో ఏమాత్రం కనిపించడం లేదన్నది సగటు ప్రేక్షకుడి వాదన. కీలక రాజకీయ కథనాల విషయంలో పత్రికా అధిపతి వైసీపీ అధినేత జగన్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం సాగుతుంది. న్యూస్ విషయంలో కనీసం టెంపర్ మెంట్ లేకపోవడం నానాటికి తీసికట్టు నాగంభోట్లు తరహాలోనే కథనాలు సాగడం పాఠకుల సంఖ్య పడిపోవడానికి ఒక కారణం కాగా పొలిటికల్ న్యూస్ విషయంలో ఎడిటోరియల్ టీం నిస్సత్తువ మరో కారణం.
ఎడిటోరియల్ బోర్డ్ డైరెక్టర్ గా ఉన్న రామచంద్రమూర్తి తో పాటు టీవీ షోలు నిర్వహిస్తున్న వారి పట్ల కూడా జగన్ అంత సంతృప్తిగా లేరని సమాచారం. దాంతో పొలిటికల్ ఎఫైర్స్ న్యూస్ టీమ్ లో కొన్ని మార్పులకు రంగం సిద్ధం చేసినట్టు సాక్షి వర్గాల్లోనే ప్రచారం సాగుతోంది. కీలక కథనాల విషయంలో బాబు అనుకూల మీడియాకి ధీటుగా స్పందిచిన సందర్భం ఈ మధ్య కాలంలో ఒక్కటి లేదు. రెండు తెలుగురాష్ట్రాల్లో ఎన్నికల ఫైట్ పీక్ స్టేజ్ లో ఉన్నా ఆ రీతిలో సాక్షి నిర్వాహకులు సన్నద్ధం కాకపోవడాన్ని వైసీపీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.
చానల్ కార్యక్రమాల విషయంలో కొన్ని మార్పులు చేపట్టిన పేపర్ పరంగా ఈ మధ్య కాలంలో సర్క్యూలేషన్ తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తుంది. సాక్షిటీం కథనాలు నిర్లిప్తంగా ఉండటంతో ఈ సర్క్యూలేషన్ కాస్త ఆంద్రజ్యోతి ఇతర చిన్నా చితక పత్రికలకు షిఫ్ట్ అయ్యింది. పొలిటికల్ లైన్ పరంగా సాక్షి, ఆంద్రజ్యోతి రెండు రెండే. ఒకటి వైసీపీ వాయిస్ అయితే మరోకటి టీడీపీకి డబ్బా కొడుతుంది అయినా ఈ స్థితిలో కూడా సాక్షి పెరగలేక చతికిలపడిపోతుంది. రాష్ట్రంలో జరుగుతున్న స్కాంల పై ఎంతో ఎగ్రసీవ్ గా జనాలలోకి వెళ్ళగలిగే స్థితిలో ఉండి కూడా సాక్షి ఎక్కడో వైఫల్యాలను చవిసూస్తుంది అంటే అది ముమ్మాటికి ఎడిటోరియల్ టీంలో ఉన్న లోపమే అన్నది నిర్వివివాదం. దింతో పెద్ద తలకాయలకు మూడినట్లే అన్న టాక్ మీడియా వర్గాల్లో వినిపిస్తుంది.